ఏఐ ఎఫెక్ట్ మెటా లో ఉద్యోగుల తొల‌గింపు..?

భారీ ఖ‌ర్చులు పెరుగుతున్నాయ‌ని లే ఆఫ్స్

hellotelugu-MetaAILayOffs

అమెరికా : ప్ర‌పంచ ఐటీ దిగ్గ‌జ సంస్థ మెటా కోలుకోలేని షాక్ ఇచ్చింది. ప్ర‌స్తుతం టెక్నాల‌జీ రంగాన్ని తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది ఏఐ. ఇదిలా ఉండ‌గా తాజాగా భారీ ఎత్తున ఉద్యోగుల‌కు మంగ‌ళం పాడేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ విష‌యాన్ని అధికారికంగా తెలియ ప‌ర్చ‌క పోయిన‌ప్ప‌టికీ చూచాయిగా తీసి వేసే ప్లాన్ కు శ్రీ‌కారం చుట్టిన‌ట్లు అందులో ప‌ని చేస్తున్న వారు వాపోతున్నారు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ఏఐనేన‌ని పేర్కొంటుండ‌డం గ‌మ‌నార్మం. ఇక మెటా కంపెనీకి సంబంధించి గ‌త‌ నవంబర్ 2022లో 11,000 మంది సిబ్బందిని తొల‌గించింది. సంస్థలో ప‌ని చేస్తున్న వారిలో దాదాపు 13 శాతానికి పైగా ఉద్యోగుల‌ను తొల‌గించింది దారుణంగా. అయితే ముంద‌స్తు స‌మాచారం లేకుండానే త‌మ‌కు లెట‌ర్లు ఇచ్చారంటూ వాపోయారు ఉద్యోగులు.

తాజాగా మెటా 20% లేదా అంతకంటే ఎక్కువ మందిని ప్రభావితం చేసే భారీ తొలగింపులను ప్లాన్ చేస్తోందని పెద్ద ఎత్తున ప్ర‌చారం జరుగుతోంది. ఇదే విష‌యాన్ని ధ్రువీక‌రిస్తూ సంచ‌ల‌న వార్త‌ను ప్ర‌చురితం చేసింది ప్ర‌ముఖ ప్ర‌పంచ మీడియా సంస్థ రాయిట‌ర్స్. టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఇటీవల మెటాలోని ఇతర సీనియర్ నాయకులకు ఈ ప్రణాళికలను సూచించారని, తిరిగి ఎలా తగ్గించాలో ప్రణాళికను ప్రారంభించమని చెప్పిన‌ట్లు స‌మాచారం. ఇది సైద్ధాంతిక విధానాల గురించి ఊహాజనిత నివేదిక అని మెటా ప్రతినిధి ఆండీ స్టోన్ పేర్కొన్నారు. ఇక పశ్చిమాసియా సంక్షోభం మధ్య జుకర్‌బర్గ్ జనరేటివ్ AIపై దృష్టి సారించారు.

Exit mobile version