TGPSC : హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) (TGPSC) కీలక ప్రకటన చేసింది. వివాదాస్పదంగా మారిన గ్రూప్ -1 ఫలితాలను ఎట్టకేలకు గురువారం ఆగమేఘాల మీద ప్రకటించింది. తాత్కాలికంగా 562 మంది ఎంపికైనట్లు వెల్లడించింది. ఇటీవల గ్రూప్ -1 పరీక్షల నిర్వహణకు సంబంధించి సింగిల్ జడ్జి సంచలన తీర్పు వెలువరించారు. ర్యాంకులను రద్దు చేయాలని, మెయిన్స్ పేపర్ల రీ వాల్యూయేషన్ తిరిగి చేపట్టాలని, ఒకవేళ కాకపోతే తిరిగి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. దీనిని సవాల్ చేస్తూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన ధర్మాసనం కోలుకోలేని షాక్ ఇచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవంటూ పేర్కొంది. కాగా హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే చేసిన కొన్ని గంటల తర్వాత కమిషన్ ఫలితాలను విడుదల చేసింది.
TGPSC Group-1 Results
గ్రూప్-I సర్వీసెస్ మెయిన్ పరీక్ష అక్టోబర్ 21 నుండి 27 వరకు గత ఏడాదిలో జరిగింది. కమిషన్ ముందుగా మార్చి 30 న ఈ ఏడాది జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రచురించింది . సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత, తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లను దాని అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఫిబ్రవరి 19, 2024 నాటి నోటిఫికేషన్ ప్రకారం నోటిఫై చేయబడిన 563 ఖాళీలలో 562 భర్తీ చేయబడ్డాయి, 2025లోని W.P. నం. 6654లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల దృష్ట్యా ఒక ఖాళీని పెండింగ్‌లో ఉంచారు. తాత్కాలిక ఎంపికలు 2025లోని రిట్ అప్పీల్ నంబర్. 1066, బ్యాచ్ కేసులు తెలంగాణ హైకోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న ఏవైనా ఇతర పిటిషన్‌ల ఫలితాలకు లోబడి ఉంటాయని కమిషన్ హెచ్చరించింది.
Also Read : South Central Railway Interesting Update : పాట్నా కి ప్రత్యేక రైలు సదుపాయం – దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
