Huge Rains – Educational Institutions Holidays : ప‌లు జిల్లాల్లో విద్యా సంస్థ‌ల‌కు సెల‌వులు

అల్ప పీడ‌నం ప్ర‌భావంతో పెద్ద ఎత్తున వ‌ర్షాలు

Hello Telugu - Huge Rains - Educational Institutions Holidays

Hello Telugu - Huge Rains - Educational Institutions Holidays

Huge Rains : హైద‌రాబాద్ – బంగాళా ఖాతంలో ఏర్ప‌డిన అల్ప పీడ‌నం దెబ్బ‌కు ఇరు తెలుగు రాష్ట్రాల‌లో కుండ పోత‌గా వ‌ర్షాలు (Huge Rains) కురుస్తున్నాయి. ప‌లు జిల్లాల్లోని గ్రామాలు, కాల‌నీలు జ‌ల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. దీంతో చెరువులు, కుంట‌లు , కాలువ‌లు, వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. పెద్ద ప్రాజెక్టుల‌న్నీ నిండు కుండ‌లా మారాయి. వ‌ర్షాలు మ‌రింత‌గా కుర‌వ‌డంతో సీఎం ఎ. రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. ఆయ‌న ఏరియ‌ల్ స‌ర్వే చేప‌ట్టారు. దీంతో ప‌లు జిల్లాల క‌లెక్ట‌ర్లు ఆయా విద్యా సంస్థ‌ల‌కు ఆగ‌స్టు 29న శుక్ర‌వారం సెల‌వు ప్ర‌క‌టించారు.

Huge Rains in Telangana

తెలంగాణ రుతుపవనాల అత్యవసర పరిస్థితి ఇప్పుడు పాఠశాల క్యాలెండర్‌ను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తోంది. కామారెడ్డి, మెదక్, కరీంనగర్, జగిత్యాల, యాదాద్రి భువనగిరిలోని పాఠశాలలు , కళాశాలలకు ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల ఆదేశాల మేర‌కు జిల్లా విద్యాశాఖ అధికారులు సెలవులు ప్రకటించారు. అదనంగా, కరీంనగర్, జగిత్యాల, యాదాద్రి భువనగిరితో పాటు నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నల్గొండ ఇప్పటికే 28న సెలవు ప్ర‌క‌టించారు. కొనసాగుతున్న వరదల కారణంగా ముందు జాగ్రత్త చర్యలు కొనసాగుతున్నాయి.

కామారెడ్డి, మెదక్ ముఖ్యంగా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కామారెడ్డి ఒకే రోజులో 43 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడంతో ఈ ప్రాంతం అపూర్వమైన వర్షపాతాన్ని చవిచూసింది, ఇందులో కేవలం నాలుగు గంటల్లోనే 30 సెంటీమీటర్లకు పైగా నమోదైంది. భారీ వర్షాల కారణంగా వరదలు, రైల్వే ట్రాక్‌లు కొట్టుకు పోయాయి. రెస్క్యూ బృందాలు ప‌నుల్లో నిమ‌గ్నం అయ్యాయి.

Also Read : YS Jagan Fired on CM Chandrababu : మోసానికి చిరునామా చంద్ర‌బాబు పాల‌న

Exit mobile version