TG High Court : హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు (TG High Court). సోమవారం స్థానిక సంస్థల నిర్వహణకు సంబంధించిన కేసుపై విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లకు పైగా అవుతున్నా ఇప్పటి వరకు ఎందుకు వాయిదా వేస్తూ వస్తున్నారంటూ ప్రశ్నించింది. అసలు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నారా లేదా అని నిలదీసింది. ప్రభుత్వాన్ని ప్రశ్నల వర్షం కురిపించింది ధర్మాసనం. నవంబర్ 24వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికల తేదీలను ప్రకటించాలని ప్రభుత్వన్ని ఆదేశించింది.
High Court Key Orders
ఇదిలా ఉండగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-E ప్రకారం పంచాయతీల కాల పరిమితి ముగిసిన ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా అన్న అనుమానం కలుగుతోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాము బీసీ రిజర్వేషన్ల పట్ల మాత్రమే అభ్యంతరం తెలిపామని, కానీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అభ్యంతరం తెలుప లేదని స్పష్టం చేసింది. కాగా బీసీ రిజర్వేషన్ గ్రామాలను పక్కనపెట్టి మిగతా గ్రామాలకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది ఎస్ఈసీ. అలా విభజించి నిర్వహించడం సరికాదని మండిపడింది ఎన్నికల సంఘంపై. అంతే కాకుండా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది హైకోర్టు.
Also Read : K Kavitha Strong Demand : నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి
