TG High Court Warning :స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై హైకోర్టు సీరియ‌స్

నెల రోజుల గ‌డువు కోరిన రాష్ట్ర ప్ర‌భుత్వం

Hello Telugu - TG High Court Warning

Hello Telugu - TG High Court Warning

TG High Court : హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది హైకోర్టు ధ‌ర్మాస‌నం. ఇంకా ఎంత టైం కావాలో చెప్పాల‌ని నిల‌దీసింది. ప్ర‌భుత్వం ఏర్పాటై ఏడాదిన్న‌ర గ‌డిచింద‌ని, స్థానిక సంస్థ‌ల పాల‌క‌వ‌ర్గాల కాల ప‌రిమితి ముగిసినా ఎందుకు ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ లేక పోయోరా చెప్పాల‌ని నిల‌దీసింది. పాల‌నా ప‌రంగా ఇబ్బందులు ఉన్నాయ‌ని అందుకే కొంత ఆల‌స్యం అయింద‌ని ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు.

TG High Court Strong Warning

ఇదిలా ఉండ‌గా స్థానిక సంస్థల ఎన్నిక లు నిర్వహించాలనే అంశంపై ప‌లు పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి. దీనిపై ఇవాళ హైకోర్టులో (TG High Court) వాదనలు జరిగాయి. పిటిషనర్లు, ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమీషన్ వాదనలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది.

ప్రభుత్వం త‌ర‌పున వాదనలు వినిపిస్తూ 30 రోజుల స‌మ‌యం త‌మ‌కు కావాల‌ని కోరింది. ఇదిలా ఉండ‌గా గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం ఎందుకు ఎన్నికలు నిర్వహించ లేదంటూ సీరియ‌స్ అయ్యింది. దీనిపై పూర్తి వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు పీపీ. ఇప్ప‌టి వ‌ర‌కు కుల గ‌ణ‌న పూర్తి కాక పోవ‌డంతో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ లేక పోయామ‌ని పేర్కొంది.

దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు పిటిష‌న‌ర్లు. ఎన్నికలైనా పెట్టాల‌ని లేక పోతే పాత స‌ర్పంచ్ లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్లను కొన‌సాగించాల‌ని కోరారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను ఆరు నెల‌ల లోపు నిర్వ‌హించాల‌ని చ‌ట్టంలో ఉంద‌ని, కానీ స‌ర్కార్ ప‌ట్టించు కోవ‌డం లేదంటూ ఆరోపించారు. మొత్తం వాద‌నలు విన్న హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంపై.

Also Read : Minister Sridhar Babu Interesting Call :ఫ్యూచ‌ర్ సిటీలో భారీగా పెట్టుబ‌డులు పెట్టండి

Exit mobile version