సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన మ‌హూవా మొయిత్రా

త‌న‌ను బ‌ల‌వంతంగా బ‌య‌ట‌కు పంపించార‌ని ఆరోప‌ణ

hellotelugu-MPMahuaMoitra

కోల్ క‌తా : ఎంపీ మ‌హూవా మోయిత్రా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. బెంగాల్ సర్క్యూట్ హౌస్ నుండి బలవంతంగా బయటకు పంపారని వాపోయింది. ఆపై త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ భారత‌దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. తనకు గది కేటాయించినప్పటికీ నాడియా జిల్లా అధికారులు తనను ప్రభుత్వ ఆధీనంలోని ఆ భవనం నుండి బలవంతంగా బయటకు పంపారని టీఎంసీ ఎంపీ ఆరోపించారు. అయితే ఈ అంశాన్ని అత్యవసరంగా విచారణకు చేపట్టేందుకు కోర్టు నిరాకరించింది. తన నియోజకవర్గమైన కృష్ణనగర్‌లో అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై స్వతంత్ర విచారణ జరపాలని కోరుతూ తనను వేధించారని మొయిత్రా ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలోని సర్క్యూట్ హౌస్‌లో తనకు గది కేటాయించినప్పటికీ జిల్లా యంత్రాంగం త‌న‌ను అకార‌ణంగా బ‌య‌ట‌కు పంపించార‌ని మండిప‌డింది ఎంపీ.

ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, న్యాయమూర్తులు జాయ్మాల్య బాగ్చీ , వి. మోహనలతో కూడిన ధర్మాసనం ముందు మొయిత్రా తరఫు న్యాయవాది వాదిస్తూ తన నియోజకవర్గమైన కృష్ణనగర్‌లో ఈ ఘటన అర్ధరాత్రి జరిగిందని తెలిపారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర విచారణ అవసరం. హైకోర్టు ఇప్పటికే రక్షణ ఉత్తర్వులను జారీ చేసినప్పటికీ ఈ ఘటన జరిగింది. ఇది ఒక ముఖ్యమైన రాజ్యాంగ పరమైన అంశంతో కూడుకున్నది కాబట్టి, దీనిని త్వరగా విచారణకు చేపట్టాలని నేను కోరుతున్నాను అని ఆమె న్యాయవాది పేర్కొన్నారు. ఆగస్టు 14 రాత్రి సర్క్యూట్ హౌస్ ప్రాంగణం నుండి బయటకు వెళ్లడానికి నిరాకరించిన తర్వాత, బయట పెద్ద సంఖ్యలో గుమిగూడిన జనం జై శ్రీరామ్ నినాదాలు చేశారని మొయిత్రా సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.

Exit mobile version