హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు, స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను గుర్తు చేశారు ఈ సందర్బంగా. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, లౌకికవాదం అనే రాజ్యాంగ విలువలకు దేశం నిబద్ధతను పునరుద్ఘాటించారు. గవర్నర్ తన ప్రసంగంలో, రాజ్యాంగాన్ని ఆమోదించడం, భారతదేశం సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపాంతరం చెందడం వంటి జనవరి 26 చారిత్రక ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. స్వాతంత్ర సమరయోధులకు ఆయన నివాళులు అర్పించారు . భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలబెట్టాలని పౌరులకు పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రత్యేక చరిత్రను ప్రస్తావించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. సెప్టెంబర్ 17, 1948న నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలు చేసిన పోరాటాన్ని , హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడాన్ని గవర్నర్ గుర్తు చేసుకున్నారు, దీనిని ఇప్పుడు అధికారికంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా ప్రజా కేంద్రీకృత పాలనను అందిస్తోందని గవర్నర్ ప్రశంసించారు .
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విక్షిత్ భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా “తెలంగాణ రైజింగ్–2047 విజన్ పాలసీని ప్రస్తావించరాఉ. ఈ విధానం 3 ట్రిలియన్ డాలర్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్మించడం , 2047 నాటికి భారతదేశం 30 ట్రిలియన్ డాలర్ల లక్ష్యానికి దోహద పడటం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన అన్నారు.

















