Telangana Young Writers Competition Interesting : తెలంగాణ యంగ్ రైట‌ర్స్ కాంపిటీష‌న్

యువ ర‌చ‌యిత‌ల‌కు సువ‌ర్ణ అవ‌కాశం

Hello Telugu - Telangana Young Writers Competition Interesting

Hello Telugu - Telangana Young Writers Competition Interesting

Young Writers : హైద‌రాబాద్ : తెలంగాణ సాంస్కృతిక శాఖ ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. ఇప్ప‌టికే కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.ఈ మేర‌కు యంగ్ రైటర్స్ కాంపిటీషన్‌కు (Young Writers) పిలుపునిచ్చింది. భారీ ఎత్తున స్పంద‌న వ‌స్తుండ‌డంతో ఔత్సాహిక యువ రచయితల అభ్యర్థనల దృష్ట్యా దరఖాస్తుల స్వీకరణ గడువును నవంబర్ 30, 2025 వరకు పొడిగిస్తున్న‌ట్లు తెలిపింది. పోటీలో పాల్గొనలేక పోయిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల‌ని సూచించింది. పోటీలో పాల్గొనేవారు ఈ మూడు విభాగాల్లో మీ ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉంటుంద‌ని పేర్కొంది. ఒక‌టి సృజ‌నాత్మ‌క వ్యాసం రాయాల్సి ఉంటుంది. తెలంగాణ అంటే మీ దృష్టిలో ఏమిటి? అనాదిగా ఈ నేల తన ప్రత్యేకతను ఎలా నిలుపుకుంటున్నదో మీ సొంత భావనలో వివరిస్తూ, 500 పదాలు మించకుండా వ్యాసాన్ని రాయాలి. రెండ‌వ‌ది కాల్పానిక ర‌చ‌న‌.

Young Writers Competition in Telangana

ప్రజా ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలైన కింది వాటిలో ఏదో ఒకదానిని ఎంచుకుని.. భవిష్యత్ తెలంగాణను అది ఏ విధంగా ఆవిష్కరిస్తుందని అనుకుంటున్నారో 500 పదాలు మించకుండా మీ అభిప్రాయాన్ని రాయాల్సి ఉంఉంది. ఇందులో భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుద్ధరణ , రిజీనల్ రింగ్ రోడ్ (RRR), యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ , హైడ్రా అంశాల‌పై ఫోక‌స్ పెట్టాల్సి ఉంటుంద‌ని తెలంగాణ సాంస్కృతిక శాఖ‌. మూడో విభాగం క‌విత‌, పాట రాయాలి. ప్రజా ప్రభుత్వ రెండేళ్ల సంక్షేమ, అభివృద్ధి, పాలనను వివరిస్తూ కవిత లేదా పాటను రాయండి. మీ పాట లేదా కవితను స్వయంగా మీరే పాడి కూడా పంపవచ్చ‌ని స్ప‌ష్టం చేసింది. ఉత్తమ రచనలను పుస్తక రూపంలో ప్రచురిస్తామ‌ని పేర్కొంది. https://forms.gle/Rg4V7TsuJDDRjMWdA మీ రచనలను ఈ కింద లింక్ ద్వారా పంపించాల‌ని కోరింది.

Also Read : KTR Shocking Comments on CM : 9,295 ప్ర‌భుత్వ భూముల‌పై క‌న్నేసిన సీఎం

Exit mobile version