మెట్రో-ఆర్టీసీ నెలవారీ పాసు ధర రూ. 4,500 తగ్గింపు

ప్రయాణికులకు దీపావళి కానుక తెలంగాణ స‌ర్కార్

hellotelugu-MetroRTC

హైద‌రాబాద్ : తెలంగాణ ప్రభుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. దీపావళి పండుగ కానుక ఇచ్చింది ప్ర‌యాణీకుల‌కు . మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాసుల ధరలను గణనీయంగా తగ్గించింది. నెలవారీ పాసు ధరను రూ. 8,500 నుండి రూ. 4,000కి తగ్గించగా, రోజువారీ పాసు ధరను రూ. 400 నుండి రూ. 275కి తగ్గించింది. ఈ కొత్త ధరలు నవంబర్ 8 నుండి అమల్లోకి వస్తాయని అధికారికంగా విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ప్రయాణికులకు దీపావళి కానుకగా, మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాసుల ధరలను రాష్ట్ర ప్రభుత్వం భారీగా తగ్గించడంతో ప్ర‌యాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.

అలాగే రోజువారీ పాసు ధరను రూ. 400 నుండి రూ. 275కి తగ్గించారు. ఈ కొత్త రోజువారీ పాసులో మెట్రో ప్రయాణానికి రూ. 200, ఆర్టీసీ సేవలకు రూ. 75 కేటాయించారు; దీని ద్వారా రోజుకు నాలుగుసార్లు ప్రయాణించే అవకాశం ఉంటుంది. నెలవారీ పాసులో మెట్రో ప్రయాణానికి రూ. 3,000, ఆర్టీసీ సేవలకు రూ. 1,000 కేటాయించారు. ఈ పాసుతో నెలకు గరిష్టంగా 50 మెట్రో ప్రయాణాలు చేయవచ్చు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి ఎటువంటి పరిమితులు ఉండవు. ఈ కొత్త ధరలు నవంబర్ 8 నుండి అమలులోకి వస్తాయని స్ప‌ష్టం చేసింది ఆర్టీసీ సంస్థ‌.

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ ధరల తగ్గింపు వల్ల రోజువారీ పాసు వినియోగదారులకు రూ. 125, నెలవారీ పాసు వినియోగదారులకు రూ. 4,500 ఆదా అవుతుందని తెలిపారు. ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గించి, ప్రజా రవాణా వ్యవస్థను మరింత అందుబాటులోకి తీసుకు రావడమే ఈ నిర్ణయం యొక్క ముఖ్య ఉద్ధేశ‌మ‌ని తెలిపారు. ప్ర‌జా ప్ర‌భుత్వం ప్ర‌యాణీకుల‌కు మెరుగైన సౌక‌ర్యాల‌ను క‌ల్పించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింద‌న్నారు.

Exit mobile version