Telangana Shocking Instructions : వినాయ‌క నిమిజ్జ‌నం ట్రాఫిక్ ఆంక్ష‌లు

ప్ర‌త్యామ్నాయ మార్గాలు ఇవేన‌న్న పోలీస్

Hello Telugu - Telangana Shocking Instructions

Hello Telugu - Telangana Shocking Instructions

Telangana : హైద‌రాబాద్ – వినాయ‌క నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా పోలీసులు కీల‌క సూచ‌న‌లు చేశారు. భారీ ఎత్తున విగ్ర‌హాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున బందోబ‌స్తు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్. ఇదే స‌మ‌యంలో వినాయ‌క మండ‌పాల నిర్వాహ‌కుల‌తో పాటు భ‌క్తులు స‌హ‌క‌రించాల‌ని కోరారు. గణేష్ విగ్రహ నిమజ్జన ఊరేగింపుల దృష్ట్యా, హైదరాబాద్ (Hyderabad) ట్రాఫిక్ పోలీసులు సెప్టెంబర్ 5 వరకు నగరం అంతటా ట్రాఫిక్ మళ్లింపులను ప్రకటించారు. కీలకమైన నిమజ్జన ప్రదేశాలైన ఎన్టీఆర్ మార్గ్ , పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్ సమీపంలో ట్రాఫిక్ రద్దీని బట్టి మధ్యాహ్నం 3 గంటల నుండి అర్థరాత్రి వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.

Telangana Traffic Police

కర్బలా మైదాన్ నుండి ట్రాఫిక్ అప్పర్ ట్యాంక్ బండ్ వైపు అనుమతించ బోమ‌ని పేర్కొన్నారు.సెయిలింగ్ క్లబ్ ద్వారా కవాడిగూడ క్రాస్‌రోడ్స్ వైపు మళ్లిస్తున్నామ‌న్నారు. లిబర్టీ లేదా ఖైరతాబాద్ వైపు వెళ్లే వాహనాలు కవాడిగూడ క్రాస్‌రోడ్స్, డిబిఆర్ మిల్స్, వర్త లేన్, స్విమ్మింగ్ పూల్, బండ మైసమ్మ, ధర్నా చౌక్, ఇందిరా పార్క్ ఎక్స్ రోడ్లు, ఆర్‌కె మఠం, కట్టమైసమ్మ జంక్షన్ , అంబేద్కర్ విగ్రహం ద్వారా లేదా తెలుగు తల్లి ఫ్లైఓవర్ , ఇక్బాల్ మినార్ వైపు వెళ్లాల‌ని సూచించారు పోలీసులు. ట్యాంక్ బండ్ ద్వారా పంజాగుట్టకు వెళ్లే వారు రాణిగంజ్, మిన్‌స్టర్ రోడ్, బేగంపేట, పంజాగుట్ట ద్వారా వెళ్లాల్సి ఉంటుంద‌న్నారు.

అంతే కాకుండా పంజాగుట్ట, రాజ్ భవన్ నుండి ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై అనుమతించ‌మ‌న్నారు. వాహనాలను నిరంకారి, ఓల్డ్ పిఎస్ సైఫాబాద్ , ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తామ‌న్నారు. ఇక్బాల్ మినార్ నుండి సికింద్రాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్ ట్యాంక్ బండ్ వైపు అనుమతించేది లేద‌న్నారు. కట్ట మైసమ్మ ఆలయం నుండి ధోబీ ఘాట్ మీదుగా వచ్చే ట్రాఫిక్ అప్పర్ ట్యాంక్ బండ్ వైపు అనుమతించ బోమ‌న్నారు. మినిస్టర్ రోడ్డు నుండి వచ్చే ట్రాఫిక్ నెక్లెస్ రోడ్డు వైపు , నల్లగుట్ట వంతెన వద్ద కర్బాలా వైపు ట్రాఫిక్ ను మళ్లిస్తామ‌న్నారు. న‌గ‌ర వాసులు, భ‌క్తులు స‌హ‌క‌రించాల‌ని కోరారు.

Also Read : HDFC Bank Shocking : రూ.47,482 కోట్లు కోల్పోయన హెచ్ డీ ఎఫ్ సీ

Exit mobile version