Telangana Tops in Crimes Sensational : మ‌హిళ‌ల‌పై నేరాల్లో తెలంగాణ టాప్

దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది

Hello Telugu - Telangana Tops in Crimes Sensational

Hello Telugu - Telangana Tops in Crimes Sensational

Telangana : న్యూఢిల్లీ : రోజు రోజుకు క్రైమ్ రేట్ పెరుగుతోంది తెలంగాణ‌లో. ప్ర‌జా పాల‌న సాగిస్తున్నామ‌ని చెబుతున్న స‌ర్కార్ కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా ప్ర‌క‌టించిన ర్యాంకుల‌లో ప్ర‌ధానంగా మ‌హిళ‌పై నేరాల్లో తెలంగాణ (Telangana) రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. ఇందులో ఎక్కువ‌గా గృహ హింస‌, లైంగిక వేదింపులు ఉన్నాయ‌ని నివేదిక వెల్ల‌డించింది. 2023లో దేశంలో మహిళలపై రెండవ అత్యధిక నేర రేటును తెలంగాణ నమోదు చేసింద‌నిపేర్కొంది. ప్రతి లక్ష మంది మహిళలకు 124.9 కేసులు నమోదు కావ‌డం గ‌మ‌నార్హం. తాజాగా వెల్ల‌డించిన రిపోర్టులో దేశ రాజ‌ధాని ఢిల్లీ నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచింది. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది నేష‌న‌ల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ).

Telangana Top Place Crimes in Women

ఇక మిగ‌తా రాష్ట్రాల ప‌రంగా చూస్తే ఒడిశా, హ‌ర్యానా, కేర‌ళ‌, రాజ‌స్థాన్ లు ఉన్నాయి. మ‌హిళ‌ల‌పై నేరాల రేటు ఢిల్లీ లో అత్య‌ధికంగా ఉండ‌డం కొంత ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఒక్క 2023వ సంవ‌త్స‌రంలోనే తెలంగాణ‌లో మ‌హిళ‌ల‌పై 23 వేల 678 నేరాలు న‌మోదైన‌ట్లు తెలిపింది. 2022లో 22 వేల 66 నేరాలు న‌మోదు కాగా 2021లో 20 వేల 865 కేసులు న మోద‌య్యాయి. ఈ రెండింటి మ‌ధ్య వ్య‌త్యాసం 7 శాతం పెరిగింది. ఛార్జిషీటింగ్ రేటు ప‌రంగా చూస్తే 88.1 శాతంగా ఉంది. జాతీయ స‌గ‌టు రేటు 77.6 శాతం కంటే ఎక్కువ‌. రాష్ట్రం ప‌రంగా చూస్తే హైద‌రాబాద్ లో పెరుగుద‌ల మ‌రింత ఎక్కువ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ ఒక్క న‌గ‌రంలోనే 3, 822 కేసులు న‌మోదు కావ‌డం ఒకింత ఆలోచించాల్సిన అంశం.

Also Read : Donald Trump Shocking Comments : నోబెల్ గెల‌వ‌క పోవ‌డం అమెరికాకు అవ‌మానం

Exit mobile version