Adluri Lakshman Interesting Comments : డ్ర‌గ్స్ ర‌హిత రాష్ట్రంగా తెలంగాణ : అడ్లూరి ల‌క్ష్మ‌ణ్

మత్తు, మాద‌క ద్ర‌వ్యాల‌కు దూరంగా ఉండాలి

Hello Telugu - Adluri Lakshman Interesting Comments

Hello Telugu - Adluri Lakshman Interesting Comments

Adluri Lakshman : హైద‌రాబాద్ : తెలంగాణ రాష్టాన్ని మత్తు పదార్థాల బారి నుండి పూర్తిగా బయటపడే రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Lakshman) స్పష్టం చేసారు.డ్రగ్స్‌కు దూరంగా జీవిత లక్ష్యాలకు దగ్గరగా అనే సందేశాన్ని ప్రతి విద్యార్థి, యువకుడి వద్దకు చేరేలా సమగ్రమైన అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. గాంధీ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట దివ్యాంగులు, వయో వృద్ధులు, ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధికారిత శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నషాముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు.

Adluri Lakshman Comments

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా చదువు, ఉద్యోగ అవకాశాలు, వ్యక్తిత్వ వికాసం వైపు నిలబెట్టడం ప్రభుత్వం ఒక ప్రధాన బాధ్యతగా తీసుకుందని మంత్రి పేర్కొన్నారు. మత్తు పదార్థాలతో పెరుగుతున్న దుష్ప్రభావాల నేపథ్యంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించిందని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో డ్రగ్ సరఫరా మార్గాలను పూర్తిగా నిర్మిలించడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టిన ఈగల్ స్పెషల్ యూనిట్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.

Also Read : Minister Sridhar Babu Interesting Comments : టి శాట్ ఛాన‌ల్ చేస్తున్న ప్ర‌య‌త్నం భేష్

Exit mobile version