Minister Sridhar Babu : హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలోని టి -శాట్ ఛానల్ మంచి కంటెంట్ ను అందిస్తూ విద్యార్థులకు మేలు చేకూరేలా చేస్తోందని ప్రశంసించారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. టి-సాట్ టీజీ టెట్-2026 డిజిటల్ కోచింగ్ పోస్టర్ ను సచివాలయంలో ఆవిష్కరించారు. డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ సచివాలయంలో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) మాట్లాడారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు నాణ్యమైన కంటెంట్ అందిస్తున్న టి- సాట్ ను అభినందించారు. ఉపాధ్యాయ ఉద్యోగ పరీక్ష డీఎస్సీకి టెట్ అర్హత తప్పనిసరి కావడంతో అభ్యర్థులందరూ టి-సాట్ డిజిటల్ కంటెంట్ ద్వారా సంసిద్ధులు కావాలని సూచించారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్షలను ప్రతీ ఏటా రెండు సీజన్లలో నిర్వహిస్తుండగా, నిత్యం అందుబాటులో ఉండే టి-సాట్ నెట్వర్క్ కంటెంట్ అన్ని స్థాయిల్లో అభ్యర్థులకు ఉపయోగ పడుతుందని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Minister Sridhar Babu Comments T Sat Channels
గత రెండు సంవత్సరాల కాలంలో మూడు టెట్ పరీక్షలు ప్రభుత్వం నిర్వహించిందని చెప్పారు శ్రీధర్ బాబు. 2026 జనవరి నెలలో నిర్వహించే టెట్-2026 పరీక్ష కోసం టి-సాట్ నెట్వర్క్ స్పెషల్ డిజిటల్ కంటెంట్ అందిస్తోందని టి-సాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యా శాఖకు మెరుగైన వసతుల్ని కల్పిస్తున్నారని, 11 వేలకు పైగా ఉపాధ్యాయ నియామకాలు రికార్డు కాలంలో పూర్తి చేసారన్నారని ప్రశంసించారు. కేంద్ర గైడ్ లైన్స్ ప్రకారం టెట్ అర్హత ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికీ తప్పనిసరి అయిన నేపథ్యంలో టెట్ కు హాజరయ్యే అభ్యర్థులతో పాటు ఉపాధ్యాయుల కోసం సైతం ప్రత్యేక కంటెంట్ అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన పరీక్షల తేదీలను అనుసరించి టెట్ పరీక్షలకు నవంబర్ 18,19వ తేదీలు మంగళ, బుధవారాల్లో లైవ్ ఓరియంటేషన్ తో పాటు మరో 44 రోజులు 200 ఎపిసోడ్స్ ప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు.
Also Read : DY CM Bhatti Vikramarka Important Update : తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో భాగస్వాములు కావాలి
