Telangana : హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో జంప్ అయిన 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా లేక కుంటి సాకులు చెబుతూ కాలయాపన చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే మూడు నెలల సమయం ఇచ్చింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court). నాలుగు రోజుల గడువు ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం నిలదీసింది. ఒకరకంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కావాలని నాన్చడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో నాలుగు వారాల గడువు కావాలని కోరడం పట్ల మండిపడ్డారు. ఇంకెంత కాలం సమయం ఇవ్వాలని నిలదీశారు. వారం రోజుల్లోపు గనుక చర్యలు తీసుకోక పోతే కోర్టు బోను ఎక్కాల్సి ఉంటుందన్నారు.
Telangana Defeating MLA’s Sensational
అంతే కాకుండా కొత్త సంవత్సరం వేడుకలు ఇంట్లో జరుపుకుంటావా లేక జైలులో జరుపుకుంటావో తేల్చు కోవాలంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో గత్యంతరం లేక స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫిరాయింపునకు పాల్పడిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. స్వచ్చంధంగగా రాజీనామా చేస్తారా లేక నాన్చుడు ధోరణి అవలంభిస్తారా అన్నది తేల్చుకోవాలంటూ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా నవంబర్ 23వ తేదీన డెడ్ లైన్ విధించారు ప్రధాన న్యాయమూర్తి. దీంతో స్పీకర్ చర్యలు తీసుకుంటారా లేక ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యేలే స్వంతంగా తప్పుకుంటారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.
Also Read : TG Govt Huge Loan Request : మరో రూ. 5000 కోట్ల అప్పు కోసం సర్కార్ ప్రయత్నం
