GST 2.0 – Telangana Suffer : జీఎస్టీ 2.0లో తెలంగాణ‌కు భారీ న‌ష్టం

ఏకంగా రూ. 7,000 కోట్ల భారీ కోత‌

Hello Telugu - GST 2.0 - Telangana Suffer

Hello Telugu - GST 2.0 - Telangana Suffer

Telangana : హైద‌రాబాద్ : తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నేతృత్వంలో జ‌రిగిన జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశం తీసుకున్న నిర్ణ‌యం తెలంగాణ (Telangana) రాష్ట్రానికి పెద్ద ఎత్తున న‌ష్టం చేకూర్చేలా చేసింది. జీఎస్టీ 2.0లో గ‌తంలో నాలుగు స్లాబ్ రేట్లు ఉండేవి. వాటి ప్రాతిప‌దిక‌న వ‌స్తువుల‌పై ప‌న్నులు వ‌సూలు చేస్తూ వ‌చ్చారు. దీని దెబ్బ‌కు పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఎక్కువ‌గా న‌ష్ట పోయారు. భారీ ఎత్తున డ‌బ్బులు చెల్లించారు. మొత్తం ఆదాయంలో 70 శాతానికి పైగా పీల్చి పిప్పి చేసింది కేంద్రం. దీంతో పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు, విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఇక గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో కేంద్రం దిగి వ‌చ్చింది. ఈ మేర‌కు జ‌ర‌గ‌బోయే న‌ష్టం గురించి ముందే ఊహించారు ప్ర‌ధాని మోదీ. ఆగ‌స్టు 15 సంద‌ర్భంగా జాతిని ఉద్దేశించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అదేమిటంటే త్వ‌ర‌లోనే పేద‌లు, మ‌ద్య త‌ర‌గ‌తి వాసుల‌కు తీపి క‌బురు చెబుతాన‌న్నారు.

GST 2.0 Telangana Suffer

ఇందులో భాగంగా జీఎస్టీ స్లాబ్ రేట్స్ ను త‌గ్గిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు జీఎస్టీ కౌన్సిల్ రెండు స్లాబ్ రేట్ల‌ను ఖ‌రారు చేసింది. ఒక‌టి 5 శాతం , రెండోది 18 శాతంగా నిర్ణ‌యించింది. దీని కార‌ణంగా జీఎస్టీ 2.0లో తెలంగాణ‌కు రూ. 7,000 కోట్ల మేర‌కు న‌ష్టం రానుంద‌ని అంచ‌నా. 2025-26లో తెలంగాణకు రూ.42,075 కోట్ల జీఎస్టీ రూపేణా వ‌స్తుంద‌ని అంచ‌నా వేశారు. 50,779 కోట్లు రాగా ఇందులో రూ. 8,705 కోట్ల నిక‌ర లాభం రానుంద‌ని ఎస్బీఐ పేర్కొంది. అయితే ఈ పెరుగుదల ఉన్నప్పటికీ, జీఎస్టీ 2.0 సంస్కరణల కింద ప్రతిపాదిత స్లాబ్ రేటు హేతుబద్ధీకరణ కారణంగా ఏటా దాదాపు రూ. 7,000 కోట్ల ఆదాయ నష్టాలు సంభవిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Also Read : Minister Nara Lokesh Important Meeting : పెట్టుబడుల సాధనకు సహకారం అందించండి

Exit mobile version