Nara Lokesh : ఢిల్లీ : ఢిల్లీ లో ప్రధాని నరేంద్ర మోడీతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు సహకారం అందించాలని కోరారు. ఏపీలో సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఐటి, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా యోగాపై రూపొందించిన పుస్తకాన్ని ప్రధానికి లోకేష్ (Nara Lokesh) బహూకరించారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర విద్యా రంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని తెలిపారు మోదీకి. ఉన్నత విద్యలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు మీ సహకారం, మార్గదర్శనం కావాలని కోరారు నారా లోకేష్.
Minister Nara Lokesh Meet PM Modi
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 15 నెలలుగా మీ సహకారంతో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నమని చెప్పారు. మీ నేతృత్వంలో వికసిత్ భారత్ – 2047లో భాగస్వాములం అవుతామని అన్నారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశంలోని కోట్లాది పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించినందుకు ప్రధాని మోదీకి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న ప్రధానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు.
రాష్ట్రంలో గత కొంతకాలంగా నెలకొన్న వివిధ పరిణామాలను మంత్రి లోకేష్ వివరించారు. ప్రధాని మోడీ స్పందించారు. . రాష్ట్రాభివృద్ధికి అన్నివిధాలా సహకారం అందిస్తామని చెప్పారు. యోగాంధ్ర నిర్వహణపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ ను ఈ సందర్భంగా ప్రధానికి లోకేష్ బహుకరించారు. అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు పీఎం.
Also Read : CM Revanth Reddy Important Comments : వినాయకుడి అనుగ్రహం వల్లే సీఎంనయ్యా
