ఆర్కేవీవై అమలులో తెలంగాణ పురోగ‌తి : తుమ్మ‌ల‌

తెలంగాణ స‌ర్కార్ ను ప్ర‌శ‌సించిన కేంద్ర మంత్రి పాటిల్

hellotelugu-Tummala

హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. ఆర్కేవీవై అమలులో అత్యుత్తమ పురోగతి సాధించింది. ఇందుకు సంబంధించి తెలంగాణను ప్రశంసించారు కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శివ‌రాజ్ పాటిల్. చౌహాన్ నిర్వ‌హించిన‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర్ రావు. ఇందుకు సానుకూలంగా స్పందించారు కేంద్ర‌మంత్రి. ఎప్ ఎఫ్ఎస్ యాప్‌ను సమర్థవంతంగా అమలు చేయ‌డం ప‌ట్ల అభినందించారు పాటిల్. ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా పప్పుధాన్యాల 100 శాతం సేకరణకు చాన్స్ ఇవ్వాల‌ని కోరారు మంత్రి. మొక్కజొన్న, ఇతర పంటల సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

మూడు రాష్ట్రాల్లో కేంద్ర ప్రాయోజిత పథకాల పురోగతిని సమీక్షించారు కేంద్ర మంత్రి. ఈ సమావేశంలో, ‘రాష్ట్రీయ కృషి వికాస్ యోజన’ అమలులో తెలంగాణ సాధించిన అద్భుతమైన పురోగతిని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫార్మర్ ఫీల్డ్ స్కూల్’ యాప్‌ను సమర్థవంతంగా అమలు చేస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. తెలంగాణకు ఆర్కేవీవై నిధుల రెండో విడతను వీలైనంత త్వరగా మంజూరు చేసి విడుదల చేయాలని మంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, నిధుల త్వరితగతిన విడుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో నెలకొన్న ఎల్ నినో పరిస్థితుల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను మంత్రి తుమ్మల కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మార్కెట్ పరమైన నష్టాల నుండి రైతులను రక్షించడానికి, వారి ఉత్పత్తులకు తగిన మద్దతు లభించేలా చూడటానికి, తెలంగాణ రైతులు పండించిన పప్పు ధాన్యాలను సేకరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ అభ్యర్థనపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, ఆ విషయాన్ని అనుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో పండించే మొక్కజొన్న, ఇతర పంటల సేకరణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కూడా మంత్రి తుమ్మల కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.రైతులు తమ ఉత్పత్తుల విక్రయంలో ఇబ్బందులు పడకుండా చూసేందుకు, సకాలంలో సేకరణ ఏర్పాట్లు చేయడం, కేంద్ర సంస్థలతో సమర్థవంతమైన సమన్వయం కలిగి ఉండటం అవసరమని ఆయన నొక్కి చెప్పారు.

Exit mobile version