Telangana Jagruti Fired on Niranjan Reddy : నిరంజ‌న్ రెడ్డి కామెంట్స్ తెలంగాణ జాగృతి ఫైర్

బంజారా బిడ్డ‌ల భూములు కాజేసింది నువ్వు కాదా

Hello Telugu - Telangana Jagruti Fired on Niranjan Reddy

Hello Telugu - Telangana Jagruti Fired on Niranjan Reddy

Telangana Jagruti : వ‌న‌ప‌ర్తి జిల్లా : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి పై తెలంగాణ జాగృతి (Telangana Jagruti) నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ నాయ‌కురాలిపై నోరు పారేసు కోవ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉన్న‌మాట అంటే ఉలికి ప‌డితే ఎలా అని ప్ర‌శ్నించారు. నీ బాగోతం గురించి ప్ర‌తి ఒక్క‌రికీ తెలుస‌న్నారు. బంజారా బిడ్డలకు చెందిన‌ 24 ఎకరాల భూమిని వేరే వాళ్లకు పట్టా చేసింది నువ్వు కాదా, ఆ విష‌యం వ‌న‌ప‌ర్తి జిల్లా వాసులంద‌రికీ తెలుస‌ని, ఆ విష‌యం మ‌రిచి పోతార‌ని అనుకుంటే ఎలా అని ఎద్దేవా చేశారు. ఏం ఆశించి మీరు ఆ పని చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు చెప్పిన విషయాలనే కవిత మాట్లాడారని వేరే వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌లు చేయ‌లేద‌న్నారు.

Telangana Jagruti Party Slams Niranjan Reddy

వనపర్తి లో నిన్ను ఎదిరించిన కార్యకర్తలపై కేసులు పెట్టలేదా అని మండిప‌డ్డారు. ఇక్క‌డికి వ‌చ్చిన త‌న‌కు త‌మ గోడు వెళ్ల బోసుకున్నార‌ని ఇందులో త‌ప్పేముంద‌న్నారు జాగృతి అధికార ప్రతినిధి మనోజా గౌడ్. గుమ్మడి కాయల దొంగ అంటే నిరంజన్ రెడ్డి ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని మండిప‌డ్డారు. ప్రజలు చెప్పినవే మాట్లాడితే మీరెందుకు ఇంత తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. నిరంజన్ రెడ్డి పై కవిత మాట్లాడారో లేదో బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ముందుకు వచ్చారు. కవిత గారి గురించి ఆయన ఆరోపణలు చేస్తున్నారని మండిప‌డ్డారు. అంటే బీజేపీ తో బీఆర్ఎస్ కు ఏం లోపాయికారీ ఒప్పందం ఉందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర అధికార ప్ర‌తినిధి నలమాస శ్రీకాంత్ గౌడ్.

Also Read : CM Chandrababu Approved : ఏపీలో 3 కొత్త జిల్లాల ఏర్పాటు

Exit mobile version