CM Chandrababu Approved : ఏపీలో 3 కొత్త జిల్లాల ఏర్పాటు

ఆమోదం తెలిపిన సీఎం చంద్ర‌బాబు

Hello Telugu - CM Chandrababu Approved

Hello Telugu - CM Chandrababu Approved

CM Chandrababu : అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు రాష్ట్రంలో త్వ‌ర‌లో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు (CM Chandrababu). ఇందులో భాగంగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఏపీ స‌చివాల‌యంలో సీఎం నారా చంద్ర‌బాబు అధ్యక్ష‌త‌న స‌మీక్ష చేప‌ట్టారు. కీల‌క అంశాల‌ను చ‌ర్చించారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో వసతులు, తాగునీటి సౌకర్యం, పారిశుధ్యంపై దృష్టి సారించాల‌ని ఆదేశించారు. సమీక్షలో గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖల మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, డోలా బాలవీరాంజనేయ స్వామి, ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హాస్టళ్ల లో వసతుల మెరుగు పరిచే అంశంపై సీఎంకు వివ‌రించారు.

CM Chandrababu Approved 3 New Districts

రాయలసీమలో హార్టికల్చర్ పంటల సాగుకు సబ్సిడీలు, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్‌తో చేయూతను ఇవ్వాల‌ని ఆదేశించారు. ఉద్యానవన పంటల ద్వారా రాయలసీమ రైతుల ఆదాయం పెంచేందుకు ప్రణాళిక అమలుపై దృష్టి సారించాల‌న్నారు. ఉద్యాన రైతులకు మరింత లబ్ధి కలిగేలా ప్రణాళిక రూపొందిస్తున్న‌ట్లు తెలిపారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. డ్రిప్, సాగునీరు, రవాణా, ప్రాజెక్టుల నిర్మాణం, పంచాయతీ రాజ్ రోడ్లు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, గోడౌన్లు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించం ద్వారా హార్టికల్చర్ రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటామ‌న్నారు.

Also Read : Minister Savitha Clear Update : సంక్రాంతి వరకూ ఆప్కో లో డిస్కౌంట్ అమ్మకాలు

Exit mobile version