Telangana Govt Important Update : మున్సిపాలిటీలకు తెలంగాణ స‌ర్కార్ న‌జ‌రానా

రూ.2,780 కోట్లు విడుదల చేసిన ప్ర‌భుత్వం

Hello Telugu - Telangana Govt Important Update

Hello Telugu - Telangana Govt Important Update

Telangana Govt : హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. ఈ మేర‌కు రాష్ట్రంలోని పుర‌పాలిక సంఘాల‌కు స‌ర్కార్ నిధులు మంజూరు చేసింది. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ (Telangana Govt) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణా రావు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా మొత్తం మున్సిపాలిటీల‌కు భారీ ఎత్తున నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా 138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2432 పనులకు ఆమోదం తెలిపింది స‌ర్కార్. వెంటనే టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కొత్త మున్సిపాలిటీలు, కొత్త గ్రామాలు విలీనమైన మున్సిపాలిటీల్లో పనులకు ప్రాధాన్యం ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేశారు.

Telangana Govt Good News

రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీలకు రూ. 2,780 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండ‌గా తెలంగాణ కోర్ అర్బన్ సిటీని మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు వెంటనే నిధులు విడుదల చేయాల‌ని ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2027లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్ర మంతటా ఉన్న పట్టణాలను గ్రోత్ హబ్‌లుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ముంద‌స్తుగా ప్లాన్స్ త‌యారు చేయాల‌ని ఆదేశించారు. దీంతో పెద్ద ఎత్తున పోటీ నెల‌కొంది. దీని త‌ర్వాత పంచాయ‌తీరాజ్ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.

Also Read : Cell Phones Burnt Sensational : బ‌స్సు ఘ‌ట‌న‌లో 234 సెల్ ఫోన్లు ద‌గ్ధం

Exit mobile version