Telangana Govt Clear Vision : విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు అడ్వైజరీ కమిటీ

ఏర్పాటు చేసిన తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌భుత్వం

Hello Telugu - Telangana Govt Clear Vision

Hello Telugu - Telangana Govt Clear Vision

Telangana Govt : హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని తెలంగాణ స‌ర్కార్ (Telangana Govt) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వ‌చ్చే డిసెంబ‌ర్ నెల 8,9వ తేదీల‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ ను నిర్వ‌హించేందుకు సిద్ద‌మైంది. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి. తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది మంత్రివ‌ర్గం. ఈ మేర‌కు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేసేందుకు గాను స‌ల‌హా క‌మిటీని ఏర్పాటు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి. ఈ క‌మిటీలో వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు భాగంగా ఉంటార‌ని తెలిపారు.

Telangana Govt Key Update

ప్ర‌ధానంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్ర‌పంచంతో పోటీ ప‌డేలా వీరు స‌ల‌హాలు, సూచ‌న‌లు చేస్తార‌ని చెప్పారు.
సామాజిక, ఆర్థిక, పర్యావరణ, పారిశ్రామిక, సాంకేతిక తదితర రంగాల్లో తెలంగాణ పురోగతి కోసం వివిధ రంగాలకు చెందిన నిపుణులు, మేదావులతో కమిటీ ఏర్పాటు చేశామ‌న్నారు. రాబోయే 25 ఏళ్లలో తెలంగాణ ప్రగతికి సంబంధించి ఈ కమిటీ వ్యూహాత్మక మార్గనిర్దేశం చేస్తుందని స్ప‌ష్టం చేశారు సీఎం. ఈ కీల‌క కమిటీలో మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు, మాజీ ఆర్బీఐ గవర్నర్లు, ఆర్థికవేత్తలు, సామాజికవేత్తలు, టెక్ నిపుణులకు ప్రభుత్వం చోటు కల్పించిందని పేర్కొన్నారు.

ఇలా అన్ని రంగాల నిపుణులను కలుపుకుని తెలంగాణ అభివృద్ధికి సరైన దశా-దిశను చూపించే విధంగా ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోంద‌ని తెలిపారు రేవంత్ రెడ్డి.

Also Read : Nara Bhuvaneswari Success Mantra : విజ‌యానికి షార్ట్ క‌ట్స్ అంటూ ఉండ‌వు

Exit mobile version