Telangana Govt : హైదరాబాద్ – జాబ్స్ కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఇందులో భాగంగా 22 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేస్తామని ప్రకటించింది. అంతే కాకుండా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందిపై కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ (Telangana Govt) వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న 22 వేల ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. గత 18 మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు వాటి అమలు తీరుపై కూడా సమీక్ష జరిపారు మంత్రులు.
Telangana Govt Good News
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర మంత్రివర్గం కేబినేట్ భేటీలకు సంబంధించి కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు జరిగిన కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, అమలుపై సమీక్ష జరిపింది. 2023 డిసెంబర్ 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు 18 కేబినెట్ సమావేశాలు జరిగాయి. 19వ సమావేశంలో వాటిపై సమీక్ష నిర్వహించింది. మొత్తం 327 అంశాలు చర్చించింది. వీటిలో 321 అంశాలను కేబినేట్ ఆమోదించింది. మిగతా వాటి అమలు పురోగతిని శాఖల వారీగా అధికారులతో మంత్రివర్గం చర్చించింది.
ఈ ఏడాదిన్నర వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. వీటితో పాటు మరో 17084 ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. కొత్తగా 22033 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. వివిధ విభాగాల్లో పని చేస్తున్న ప్రతీ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పనితీరును సమీక్షించేందుకు వీలుగా వారి ఆధార్, పూర్తి వివరాలు సేకరించాలని ఆర్థిక శాఖను ఆదేశించింది.
Also Read : Hero Karthi-Kalyani Priyadarshan : కార్తీతో జత కట్టిన కళ్యాణి ప్రియదర్శన్
