Kalyani Priyadarshan : ఎవరీ కళ్యాణి ప్రియదర్శన్ అనుకుంటున్నారా. తను తాజాగా వార్తల్లో నిలిచారు. ప్రముఖ కోలీవుడ్ నటుడు కార్తీతో కలిసి తెర పంచుకోనున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణ సారథ్యంలో కార్తీ 29 పేరుతో కొత్త మూవీ మార్షల్ ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. తను మణిరత్నం దర్శకత్వం వహించిన సూపర్ హిట్ మూవీ పొన్నియన్ సెల్వన్ లో తళుక్కున మెరిశాడు నటుడు కార్తీ. ఆ తర్వాత వచ్చిన సత్యం సుందరం చిత్రంలో మనసుల్ని దోచేశాడు. తన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకులను కట్టి పడేసేలా రోజా ఫేమ్ అరవింద్ స్వామితో పోటీ పడి నటించాడు కార్తీ.
Kalyani Priyadarshan Movie with Karthi
తాజాగా మార్షల్ లో తను కీ రోల్ పోషించనున్నాడు. ప్రస్తుతం తమిళ సినీ రంగంలో తానక్కరన్ సినిమాతో పేరు పొందిన దర్శకుడు తమిజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఈ ప్రాజెక్టును ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ తో నిర్మించనున్న మూవీలో కీ రోల్ పోషించేందుకు ఎంపికైంది అందాల ముద్గులగుమ్మ కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan). కార్తీ సర్దార్ -2 లో నటించాడు కార్తీ. తన సినీ కెరీర్ లో ఈ మార్షల్ చిత్రం 29వది. ఇషాన్ సక్సేన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు .
పూజా కార్యక్రమాలు ప్రారంభించిన వెంటనే షూటింగ్ మొదలు పెట్టారు దర్శకుడు. మార్షల్ చిత్రంలో ప్రముఖ నటుడు సత్య రాజ్, ప్రభ/, లాల్ , జాన్ కొక్కెన్, ఈశ్వరి రావు, మురళి శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సందర్బంగా హీరోయిన కళ్యాణి ప్రియదర్శన్ మాట్లాడారు. ప్రముఖ నటుడు కార్తీతో తెర పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు.
Also Read : HCA President Jagan Mohan Shocking : హెచ్ సీ ఏ ప్రెసిడెంటా మజాకా
