Telangana Govt New Innovation : మ‌హిళా సంఘాల‌కు రూ. 344 కోట్లు విడుద‌ల

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం

Hello Telugu - Telangana Govt New Innovation

Hello Telugu - Telangana Govt New Innovation

Telangana Govt : హైద‌రాబాద్ – తెలంగాణ ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు రాష్ట్రంలోని మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌ను మ‌రింత బ‌లోపేతం చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఏకంగా రూ. 344 కోట్ల వడ్డీ లేని రుణాల‌ను విడుద‌ల చేసింది. తెలంగాణ ఆర్థిక శాఖ సెర్ప్ కి రిలీజ్ చేసింది.

Telangana Govt New Innovation

ఇందులో గ్రామీణ మహిళా సంఘాలకు రూ.300 కోట్లు, పట్టణ మహిళా సంఘాలకు రూ.44 కోట్ల చొప్పున కేటాయించింది ప్ర‌భుత్వం. ఈనెల 12వ తేదీ నుంచీ 18వ తేదీ వ‌ర‌కు మహిళా సంఘాల ఖాతాల్లో నిధులు జ‌మ చేయాల‌ని ఆదేశించింది స‌ర్కార్.

ఈ సంద‌ర్బంగా ఆయా శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌లో మ‌హిళా స్వ‌యం సహాయ‌క సంఘాల మ‌హిళ‌ల‌కు చెక్కులు అంద‌జేస్తారు మంత్రులు, ఎమ్మెల్యేలు. సంఘాల‌కు చెక్కుల‌తో పాటు ప్ర‌మాద భీమా, రుణాల‌కు సంబంధించిన భీమా చెక్కుల‌ను కూడా పంపిణీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణా రావు వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఆయ‌న అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండ‌గా గ‌త 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో నిలిచి పోయాయి వ‌డ్డీ లేని రుణాలు. రూ. 3 వేల కోట్ల‌కు పైగా మ‌హిళా సంఘాల‌కు బ‌కాయిలు పెట్టింది.

రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కాంగ్రెస్ స‌ర్కార్ వ‌చ్చాక మ‌హిళా సంఘాల బ‌లోపేతంపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు. అంతే కాకుండా ఆయా సంఘాల‌కు ఏకంగా టీజీఎస్ఆర్టీసీలో బ‌స్సుల‌ను కూడా కేటాయించారు. ఇది విప్ల‌వాత్మ‌క‌మైన మార్పుగా అభివ‌ర్ణించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతే కాకుండా ఇచ్చిన మాట ప్ర‌కారం రాష్ట్ర వ్యాప్తంగా మ‌హిళ‌లు, బాలిక‌లు, యువ‌తుల‌కు ఉచితంగా బ‌స్సు ప్ర‌యాణం అమ‌లు చేస్తూ వ‌స్తున్నారు. ఇందులో ప‌ల్లె వెలుగు బ‌స్సుల‌తో పాటు ఎక్స్ ప్రెస్ బ‌స్సులు కూడా ఉన్నాయి.

Also Read : CM Chandrababu Innovative : జనమే బలం ఆర్థిక పురోగ‌తికి సోపానం – సీఎం

Exit mobile version