CM Chandrababu Innovative : జనమే బలం ఆర్థిక పురోగ‌తికి సోపానం – సీఎం

జనాభా నిర్వాహణకు ఉత్తమ పాలసీలు అమలు

Hello Telugu - CM Chandrababu Innovative

Hello Telugu - CM Chandrababu Innovative

CM Chandrababu : అమరావతి – దేశానికి బలమైన ఆర్థిక వనరు జనాభేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జనాభా పెరుగుదలకు త్వరలో మంచి పాలసీ తీసుకొస్తామని ప్ర‌క‌టించారు. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని చెప్పిన గురజాడ అప్పారావు స్ఫూర్తితో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సచివాలయం వద్ద ప్రపంచ జనాభా దినోత్సవంపై మొదటి అమరావతి సమ్మిట్‌కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జనాభా నిర్వహణా విధానం ప్రతి కుటుంబం ముఖ్యం-మీ అభిప్రాయం మార్గదర్శనం అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన సర్వేను సీఎం ప్రారంభించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు.

CM Chandrababu Innovative

సమైక్యాంధ్రలో జనాభా నియంత్రణను ఉద్యమంలా చేపట్టామని, ఇప్పుడు జనాభా నిర్వహణ అవసరమని చెబుతున్నానని చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. అగ్రదేశాలతో భారత్ పోటీ పడుతోందంటే దానికి జనాభానే కారణమని అన్నారు. ఒకప్పుడు జనాభా పెద్ద సమస్య‌గా ఉండేదన్నారు. 2004కు ముందు సీఎంగా ఉన్నప్పుడు జనాభా నియంత్రణకు ప్రోత్సాహకాలు ఇచ్చానని తెలిపారు. ఇద్దరు పిల్లల కంటే ఎక్కుమంది ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులని చేస్తూ చట్టాన్ని తెచ్చానని గుర్తు చేశారు. ఇప్పుడు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీకి అర్హులుగా చట్టం తీసుకు రావాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. దేశం అంటే రాష్ట్రాలు, ప్రాంతాలు, పట్టణాలు, సరిహద్దులు, భూభాగాలు మాత్రమే కాదు, దేశం అంటే మనుషులు’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

1989 జూలై 11న ప్రపంచ జనాభా 5 బిలియన్లకు చేరిన సందర్భంగా ఐక్యరాజ్య సమితి జూలై 11వ తేదీని ప్రపంచ జనాభా దినోత్సవంగా ప్రకటించిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఈ రోజు ప్రపంచంలో 10 నుంచి 24 ఏళ్ల వయసు ఉన్నవారు 1.8 బిలియన్లు ఉన్నారని, ఒకప్పుడు జనాభా ఎక్కువ ఉన్న దేశాలను చులకనగా చూసే వార‌న్నారు. కానీ ఇప్పుడు సీన్ మారింద‌న్నారు. ఇప్పుడు జ‌నాభా ఎక్కువ‌గా ఉన్న దేశాల వైపే అగ్రరాజ్యాలు చూడాల్సి వస్తోందన్నారు.

Also Read : Telangana Govt Breakthrough : కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఫిక్స్

Exit mobile version