క‌రువు నివార‌ణ‌పై తెలంగాణ స‌ర్కార్ ఫోక‌స్

ఎల్ నినో ప్ర‌భావాన్ని ఎదుర్కొనేందుకు సిద్దం

hellotelugu-TelanganaGovt

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎల్ నినో గురించి అప్ర‌మ‌త్తం అయ్యింది. రాబోయే రోజుల్లో ఎల్ నినో ప్ర‌భావం నుంచి గ‌ట్టెక్కించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం ఇప్ప‌టికే సూచించారు. రాష్ట్రంలో ‘ఎల్ నినో’ ప్రభావం , కరువు పరిస్థితులపై ఈ నెల 12న మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. తక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతాల్లోని పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వం చేపట్టాల్సిన తక్షణ చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. వ్యవసాయం, సాగునీరు, తాగునీటి సరఫరా, పెరిగిన విద్యుత్ డిమాండ్ , తక్షణ అవసరాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కరువు పరిస్థితులపై సమగ్రంగా చర్చించారు.

ఎల్ నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో సాధారణం కంటే 17% తక్కువ వర్షపాతం నమోదైంది; దాదాపు 235 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. కరువు ప్రభావిత మండలాలను ప్రకటించడంతో పాటు, తగిన ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసింది. అలాగే, రూ. 20,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కేటాయించాలని కూడా కోరింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కరువు ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయక చర్యలు, మంత్రివర్గ ఉప-సంఘం ఇప్పటికే రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక, అఖిలపక్ష సమావేశం, రైతు సంఘాలు , వివిధ రంగాల నిపుణుల సలహాలు, సూచనలపై చర్చిస్తారు.

ప‌లువురు నిపుణులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్న‌తాధికారులు, మేధావులు, బుద్ది జీవుల నుంచి కీల‌క‌మైన సూచ‌న‌లు స్వీక‌రించేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ఇప్ప‌టికే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.

Exit mobile version