Election Commission Shocking Restrictions : జూబ్లీ హిల్స్ ఓట‌ర్ల‌కు ఎన్నిక‌ల సంఘం సూచ‌న‌లు

12 గుర్తింపు ప‌త్రాల‌లో ఏదో ఒక‌టి చూపిస్తేనే ఓటు హ‌క్కు

Hello Telugu - Election Commission Shocking Restrictions

Hello Telugu - Election Commission Shocking Restrictions

Election Commission : హైద‌రాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఈనెల 11న జ‌ర‌గ‌నుంది. 14న ఫ‌లితాలు వెల్ల‌డిస్తుంది రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం. ఇప్ప‌టికే ముగ్గురు కేంద్ర ఉన్న‌తాధికారుల‌ను ప‌రిశీల‌కులుగా నియ‌మించింది. ప్ర‌స్తుతం జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ క‌ర్ణ‌న్ రిట‌ర్నింగ్ అధికారిగా ఉన్నారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం (Election Commission) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు తాము గుర్తించిన 12 గుర్తింపు కార్డులలో ఏదో ఒక‌టి ఉంటేనే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల్లో ఓటు వేసేందుకు అర్హులు అవుతార‌ని తెలిపింది. ఈ మేర‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు ఎన్నిక‌ల అధికారి సుద‌ర్శ‌న్ రెడ్డి. ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఓటరు విధిగా ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకు రావాలని కోరారు.

Telangana Election Commission Comments

ఫోటో ఐడీ కార్డు (EPIC) లేకపోతే, ఈ 12 ఫోటో గుర్తింపు పత్రాలలో ఏదైనా ఒకటి చూపించొచ్చ‌ని తెలిపారు. ఇందులో ప్ర‌భుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు, ఎంఎన్‌ఆర్‌ఈజీఎ ఉద్యోగ కార్డు, బ్యాంకు లేదా పోస్టాఫీస్‌ జారీ చేసిన ఫొటో ఉన్న పాస్‌బుక్‌, హెల్త్‌ ఇన్ష్యూరెన్స్‌ స్మార్ట్‌ కార్డు (ఆయుష్మాన్‌ భారత్‌ కార్డు సహా), డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌ కార్డు , నేషనల్‌ పాప్యులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్‌పీఆర్‌) కింద జారీ చేసిన స్మార్ట్‌ కార్డు, భారత స‌ర్కార్ జారీ చేసిన పాస్‌పోర్టు, ఫొటోతో ఉన్న పెన్షన్‌ పత్రం, ప్రభుత్వ, పీఎస్‌యూ లేదా పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగి గుర్తింపు కార్డు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అధికార గుర్తింపు కార్డు . సామాజిక న్యాయశాఖ జారీ చేసిన వికలాంగుల యూనిక్‌ ఐడీ (UDID) కార్డు విధిగా ఉంటేనే ఓటు వేసేందుకు అర్హులు అవుతార‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Hydraa Sensational Performance : హైడ్రా పనితీరు భేష్ న‌గ‌ర‌వాసులు ఖుష్

Exit mobile version