Hydraa : హైదరాబాద్ : హైదరాబాద్ లో కబ్జాదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది హైడ్రా. ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఆక్రమణకు గురైన ప్లాట్లను తిరిగి అప్పజెప్పిన హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు పోచారం మున్సిపాలిటీలోని దివ్యానగర్ లేఔట్‌లోని 2218 మంది ప్లాట్ యజమానులు.. హైడ్రాకు (Hydraa) ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా సరిపోదన్నారు. ఇందుకు కృతజ్ఞతలు తెలియ చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు. పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. రహదారుల ఆక్రమణ, పార్కుల దురాక్రమణను హైడ్రా తొలగించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. దీని కారణంగా తమకు ఎంతో మేలు చేకూరిందన్నారు.
Hydraa Performance
ఒకనాడు తమ ప్లాట్ల వద్దకు వెళ్లాలంటే భయంగా ఉండేదన్నారు. కానీ అడ్డంకులను హైడ్రా తొలగించడంతో తమ ప్లాట్లకు తాము వెళ్లేందుకు వీలు కుదిరిందంటూ ఆనాటి పరిస్థితులను మరోసారి గుర్తు చేసుకున్నారు స్థానికులు. తమ ప్లాట్లు ఆక్రమణకు గురైనట్లు వాపోయారు. ఈమేరకు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా రంగంలోకి దిగింది. ఈ ఏడాది జనవరి నెల 25వ తేదీన దాదాపు 200 ఎకరాల్లో 2218 ప్లాట్లుగా విస్తరించిన దివ్య లేఔట్ చుట్టూ 4 కిలోమీటర్ల మేర నిర్మించిన ప్రహరీని హైడ్రా తొలగించింది. అప్పుడు సంబరాలు చేసుకున్నాం. ప్రహరీ నిర్మించి తమ ప్లాట్లలోకి వెళ్లకుండా నల్ల మల్లారెడ్డి ఆంక్షలు విధించడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో హైడ్రాను ఆశ్రయించామని అప్పటి రోజులు గుర్తు చేసుకున్నారు. నల్ల మల్లారెడ్డి కోటగోడలు, అడ్డు గోడలు బద్ధలు కొట్టి 2218 మంది ప్లాట్లకు విముక్తి కల్పించిన హైడ్రాకు ధన్యవాదాలంటూ మరో సారి ర్యాలీ నిర్వహించి అదే లే ఔట్‌లో సమావేశమయ్యారు ప్లాట్ యజమానులు.
Also Read : Minister Nimmala Clear Update : రూ. 2 వేల కోట్లతో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తి
