Telangana EC : హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి సంచలన ప్రకటన చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం (Telangana EC). బుధవారం ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది . వచ్చే నెల నవంబర్ 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు బైల్ పోల్ కు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడాన్ని నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది. ముందస్తుగా ప్రచురించడం, ప్రసారం చేయడం నేరంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది.
Telangana EC Shocking
ఈ నిషేధం ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాతో సహా అన్ని మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఏదైనా ఉల్లంఘన ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 126A కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం పేర్కొంది, ఇది ఎన్నికల కాలంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిర్వహించడం లేదా వ్యాప్తి చేయడంపై పరిమితులను పరిగణిస్తుంది. స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికల ప్రక్రియను నిర్ధారించడానికి మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు , వ్యక్తులు మార్గదర్శకాలను పాటించాలని కోరారు జూబ్లీహిల్స్ ఎన్నికల ఇంఛార్జి, హైదరాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ ఆర్వీ కర్ణన్.
నోటిఫికేషన్ నంబర్ 576/EXIT/2025/SDR/Vol.I ప్రకారం నవంబర్ 6వ తేదీ గురువారం ఉదయం 7 గంటల నుండి 11వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ ఆదేశాన్ని ఏదైనా ఉల్లంఘిస్తే 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 126A కింద శిక్షార్హమైన చర్య తీసుకుంటామని హెచ్చరించారు. రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటిని అమలు చేస్తామన్నారు.
Also Read : Shami Fired on Agarkar : సెలెక్షన్ కమిటీ చైర్మన్ అగార్కర్ పై షమీ సీరియస్
