Telangana CS Effective – Kaleshwaram : కాళేశ్వ‌రం క‌మిష‌న్ నివేదిక‌లో సీఎస్ ప్ర‌స్తావ‌న

ప‌ద‌వికి రాజీనామా చేస్తారా లేక త‌ప్పుకుంటారా

Hello Telugu - Telangana CS Effective - Kaleshwaram

Hello Telugu - Telangana CS Effective - Kaleshwaram

Telangana CS : హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు (Telangana CS) ఆగ‌స్టు 30న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. తాజాగా ప్ర‌భుత్వం నియ‌మించిన కాళేశ్వ‌రం కమిష‌న్ చైర్మ‌న్ జ‌స్టిస్ పీసీ ఘోష్ తుది నివేదిక స‌ర్కార్ కు అంద‌జేసింది. ఇందులో ప్ర‌ధానంగా కీల‌క‌మైన పాత్ర పోషించిన‌ట్లు సీఎస్ పేరును ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌డం క‌ల‌క‌లం రేపింది. త‌ను ప‌ద‌వికి రాజీనామా చేస్తారా లేక ప‌ద‌వీ కాలాన్ని పొడిగిస్తారా అన్న‌ది వేచి చూడాలి. గ‌త కేసీఆర్ బీఆర్ఎస్ ప్ర‌భుత్వ పాల‌నా కాలంలో రామ‌కృష్ణా రావు ఎక్కువ కాలం ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. కీల‌క‌మైన పాత్ర పోషించారు. ఆయ‌న ఏది చెబితే అది న‌డిచింద‌న్న పేరు కూడా అప్ప‌ట్లో వ‌చ్చింది.

Telangana CS Rama Krishna Rao Key Role

ఇది ప‌క్క‌న పెడితే 10 ఏళ్ల పాటు రాజ్య‌మేలిన బీఆర్ఎస్ బాస్ తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. పెద్ద ఎత్తున అవినీతి, అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని కాంగ్రెస్ ఆరోపించింది. వీటి పైనే ఫోక‌స్ పెట్టింది. ఎన్నిక‌ల్లో ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించింది. సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ కొలువు తీరాక కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి చోటు చేసుకున్న అక్ర‌మాల‌పై ఫోక‌స్ పెట్టింది. విచార‌ణ‌కు ఆదేశించారు. ఏకంగా క‌మిష‌న్ ను ఏర్పాటు చేశారు. రెండు నెల‌ల‌కు పైగా కాళేశ్వ‌రం క‌మిష‌న్ ప‌ని చేసింది. ప‌లువురిని విచారించింది. ఇందులో మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హ‌రీశ్ రావుల‌ను కూడా విచారించింది. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో మ‌రో కీల‌క‌మైన నేత‌ను, ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ ను కూడా విచార‌ణ‌లో భాగంగా పిలిపించింది. చివ‌ర‌కు క‌మిష‌న్ తుది నివేదిక‌ను స‌మ‌ర్పించింది.

Also Read : CM Chandrababu Alarming : సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ – సీఎం

Exit mobile version