విపత్తుల ప్రభావాన్ని తగ్గించేలా చర్యలు : అనిత

స‌చివాల‌యంలో ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష

hellotelugu-AnithaVangaalapudi

అమ‌రావ‌తి : నైరుతి రుతుపవనాలు, ఎల్-నినో ప్రభావంపై ఉన్నత స్థాయి అధికారులతో హోం మంత్రి అనిత వంగ‌ల‌పూడి సోమ‌వారం సమీక్ష చేప‌ట్టారు . ఈ సంద‌ర్బంగా విపత్తుల ప్రభావాన్ని తగ్గించేలా సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పత్తుల వలన ఏ ఒక్క ప్రాణనష్టం జరగకుండా చూడటమే లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నిరంతరం పనిచేసేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు చేయాల‌ని అన్నారు. రాయలసీమ జిల్లాలపై ఎక్కువగా ఎల్ నినో ప్రభావం ఉంద‌ని ఇప్ప‌టికే నివేదిక‌లు అందాయ‌ని వెల్లడించారు. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు వంగ‌ల‌పూడి అనిత‌.శ్రీ సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో తీవ్రస్థాయిలో వర్షాల కొరత ఏర్ప‌డింద‌న్నారు.

కర్నూలు, నంద్యాల, చిత్తూరు, కడప జిల్లాల్లో మధ్యస్థంగా వర్షభావ ప్రభావం ఉంద‌న్నారు హోం శాఖ మంత్రి. ఇదే క్ర‌మంలో ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మధ్యస్థంగా వర్షభావ ప్రభావం ఉంద‌న్నారు.కరవు ముప్పు ఉన్న మండలాల్లో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు వంగ‌ల‌పూడి అనిత‌, వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపునకు ప్రణాళికలు సిద్ధం చేయాల‌ని ఆదేశించారు. పునరావాస కేంద్రాలలో ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల‌న్నారు. తాగునీరు, విద్యుత్ వంటి కీలక సేవలకు ఎలాంటి అంతరాయం కలగకూడదని స్ప‌ష్టం చేశారు.పోలీస్, ఫైర్, NDRF, APSDRF బృందాలు అత్యవసర స్పందనకు సిద్ధంగా ఉండాలన్నారు.

Exit mobile version