Palla Srinivas : అమరావతి : దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలని పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు (Palla Srinivas). బుధవారం 150 ఏళ్ల సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్బంగా ఎంపీ శ్రీ భరత్ తో కలిసి పల్లా శ్రీనివాస రావు విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ రోడ్ లో జరిగిన మేరా యువ భారత్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు.
దేశ సమైక్యతకు ప్రతీక అయిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఆత్మ స్ఫూర్తి ప్రతి యువకుడిలో దేశభక్తి భావనను మరింతగా ప్రేరేపించాలి అని అన్నారు. ఆయన తీసుకున్న అసాధారణ నిర్ణయాల వల్లనే ఆనాడు సంస్థానాలు భారత దేశంలో కలిశాయని గుర్తు చేశారు.
TDP Chief Palla Srinivas Comments
పటేల్ తన జీవిత కాలమంతా దేశం కోసం, భావి భారత పౌరులు బాగుండాలని కోరుకున్నారని చెప్పారు పల్లా శ్రీనివాస రావు. తమ కూటమి సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా పటేల్ జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవోపేతంగా నిర్వహిస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఆర్కే రోడ్ లో భారీ ర్యాలీ నిర్వహించామన్నారు. ఎంతో మంది ఈ ర్యాలీలో స్వచ్చంధంగా పాల్గొనడం మరింత సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. జాతి కోసం, దేశ భక్తి కోసం ప్రతి ఒక్కరు పాలు పంచుకునేందుకు ముందుకు రావల్సిన అవసరం ఉందన్నారు పల్లా శ్రీనివాస రావు. యువతీ యువకుల చేతుల్లో భారత భవితవ్యం ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. మీరు లేక పోతే ఈ దేశం లేదన్నారు.
Also Read : Shubman Gill Growth : శుభ్‌మన్ గిల్ కు మంచి భవిష్యత్తుంది
