టైల‌ర్ల‌కు ప్రాధాన్యం ఉపాధికి సోపానం : ఎస్. స‌విత

స్ప‌ష్టం చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి

hellotelugu-MinisterSavitha

తాడేపల్లి గూడెం : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రానున్న ఆదరణ 3.0 పథకంలో టైలర్లకు ప్రాధాన్యం ఇస్తామ‌ని అన్నారు. ఈ సంద‌ర్బంగా అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ ఆధునిక కుట్టు మిషన్లు అందజేయనున్నామని వెల్లడించారు. టైలర్ల సంక్షేమానికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్ప‌ష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను ఏపీ టైలర్ల ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి మర్యాద పూర్వకంగా కలిశారు. పలు సమస్యల పరిష్కారానికి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడారు. టైలర్లు ఆర్థికంగా నిలదొక్కు కోవ‌డానికి సీఎం చంద్రబాబు ఆర్థిక భరోసా కలిగేలా పథకాలు రూపకల్పన చేస్తున్నారని చెప్పారు మంత్రి ఎస్. స‌విత‌.

త్వరలో రూ.1000 కోట్లతో ఆదరణ 3.0 పథకం శ్రీకారం చుడుతున్నామని, టైలర్లకు అధునాత కుట్టు మిషన్లు అందజేయాలనే ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. గతంలోనూ ఆదరణ, ఆదరణ 2.0 పథకాల అమలు సమయాల్లోనూ టైలర్లకు సీఎం చంద్రబాబు అండగా నిలిచారని గుర్తు చేశారు ఎస్. స‌విత‌. 2014-19 మధ్య ఆదరణ పథకంతో పాటు బీసీ సబ్సిడీ రుణాలు అందజేసి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారన్నారు. టైలర్లు అన్ని సామాజిక వర్గాల్లోనూ ఉన్నారని, వారందరికీ మేలు కలిగేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆప్కో షో రూమ్ ల, ఈ కామర్స్ సంస్థల్లో విక్రయించే చేనేత రెడీ మేడ్ దుస్తుల తయారీలో టైలర్లను భాగస్వాములను చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తోందన్నారు.

Exit mobile version