చెన్నై : తమిళనాడు శాసన సభ నుండి వాకౌట్ చేసిన డీఎంకే ఎమ్మెల్యేలతో సమావేశమైన తర్వాత అసెంబ్లీ కార్యకలాపాలు జరుగుతున్న తీరును ఆ పార్టీ చీఫ్, మాజీ సీఎం స్టాలిన్ విమర్శించారు . మిసా చట్టం , సర్కారియా కమిషన్‌పై ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా డీఎంకే ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిష్కరించారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర శాసనసభ గౌరవ ప్రదంగా నడుస్తోందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎం.కె. స్టాలిన్ .అసెంబ్లీ కార్యకలాపాల నిర్వహణ తీరును తప్పుబట్టారు.”శాసనసభ గౌరవం ఎంతలా ఉందంటే, అసలు అది గౌరవ ప్రదంగా నడుస్తోందా అని ప్రశ్నించు కోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని, దీనికి ప్రధాన కారకుడు సీఎం విజయ్ అని ఆరోపించారు. సభలో విజయ్ చేసిన వ్యాఖ్యలపై మండిప్డడారు సభ్యులు. ఆ తర్వాత నిరసన తెలుపుతున్న డీఎంకే శాసన సభ్యులను సభ నుండి బయటకు పంపాలని స్పీకర్ మార్షల్స్‌ను ఆదేశించారు.
ముఖ్యమంత్రి సమాధానం ఇస్తున్నప్పుడు మిసా చట్టం, సర్కారియా కమిషన్ , విజిలెన్స్ కేసుల ప్రస్తావనపై ఎమ్మెల్యే , పార్టీ విప్ ఈవీ వేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దర్యాప్తులో ఉన్న కేసుల గురించి సభలో చర్చించ కూడదని ఆయన వాదించారు. కేసుల వివరాలను చదివి వినిపించడం సంప్రదాయాన్ని ఉల్లంఘించడమే అన్నారు. ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చే సమయంలో విజిలెన్స్ కేసుల గురించి చదవడం సంప్రదాయ ఉల్లంఘన అవుతుందని అన్నారు. దర్యాప్తులో ఉన్న కేసులపై వ్యాఖ్యలు చేయకూడదని ఆ విషయం తెలుసు కోక పోతే ఎలా అని మండిపడ్డారు. ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితి నుండి చర్చను పక్కదారి పట్టిస్తున్నారని వేలు ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా గత డీఎంకే ప్రభుత్వాల హయాంలో జరిగిన అవినీతి, అక్రమాల ఆరోపణలతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమాచారం , సర్కారియా కమిషన్ నివేదిక అంశాలను విజయ్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.
