Suresh Raina : ఢిల్లీ : మాజీ క్రికెటర్ సురేష్ రైనా షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సందర్బంగా మూడు ఫార్మాట్ లకు ఎంపిక చేసిన ఆటగాళ్ల వ్యవహారంపై స్పందించారు. రిషబ్ పంత్ స్ట్రైక్ రేట్ కంటే కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ స్ట్రైక్ రేట్ మెరుగ్గా ఉందన్నారు. మరి ఏ ప్రాతిపదికన పంత్ ను ఎంపిక చేశారంటూ ప్రశ్నించారు సురేష్ రైనా (Suresh Raina). తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన కీలకమైన రెండో టెస్టులో సైతం భారత్ జట్టు తడబడటం పట్ల మండిపడ్డారు. అసలు హెడ్ కోచ్ ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ప్రతిభ, నైపుణ్యం ఆధారంగా జట్టును ఎంపిక చేయాలని అన్నారు.
Suresh Raina Shocking Comments on Sanju Samson Rejection
మరో వైపు ఒక ఆటగాడికి కనీసం ఐదు లేదా 10 మ్యాచ్ లలో ఆడేందుకు ఛాన్స్ ఇవ్వాలని అప్పుడే అసలైన టాలెంట్ ఏమిటో బయట పడుతుందని సురేష్ రైనా స్పష్టం చేశారు. భారత టెస్ట్ క్రికెట్ టాప్ ఆర్డర్‌లో సంజు సామ్సన్ మంచి ఎంపిక అని అభిప్రాయపడ్డాడు. తను గతంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సీరీస్ లో అద్బుతంగా రాణించాడని , ఎందుకు తనను పరిగణలోకి తీసుకోలేదంటూ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా తొలి టెస్టులో భారత జట్టు ఓటమి చెందడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదే సమయంలో టి20, వన్డే ఫార్మాట్ లలో అద్బుతంగా రాణించినా ఎందుకని సంజూ శాంసన్ ను ఎంపిక చేయలేదంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
Also Read : Minister Kandula Durgesh Interesting Comments : ‘రాజీ’ చిత్రానికి క్లాప్ కొట్టిన కందుల దుర్గేష్



















