Supreme Court Fired on Rahul Gandhi : రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సీరియ‌స్

మీరు నిజమైన భారతీయులైతే ఇలా మాట్లాడరంటూ పేర్కొంది...

Hello Telugu - Supreme Court Fired on Rahul Gandhi

Hello Telugu - Supreme Court Fired on Rahul Gandhi

Supreme Court : ఢిల్లీ – కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పై మండిపడింది సుప్రీంకోర్టు. చైనాతో ఘర్షణపై తాను చేసిన వ్యాఖ్య‌లను త‌ప్పు ప‌ట్టింది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని 2022లో ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ.ఈక్రమంలో 2 వేల చదరపు.కి.మీ ప్రాంతాన్ని చైనా ఆక్రమించిందని మీకెలా తెలుసు అని రాహుల్ గాంధీని ప్రశ్నించింది సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court). మీ వద్ద విశ్వసనీయమైన ఆధారం ఉందా.. మీరు నిజమైన భారతీయులైతే ఇలా మాట్లాడరంటూ పేర్కొంది.

Supreme Court Slams Rahul Gandhi

సరిహద్దు దాటి వివాదం జరిగినప్పుడు ఇవన్నీ చెప్పగలరా అని నిలదీసింది. ఇలాంటివి పార్లమెంటులో మాట్లాడాల‌ని సూచించింది. సోషల్ మీడియాలో కాదు అని రాహుల్ గాంధీకి (Rahul Gandhi) సూచించింది సుప్రీంకోర్టు. ఒక బాధ్య‌తాయుత‌మైన ఎంపీ ప‌ద‌విలో ఉంటూ, ప్ర‌తిపక్ష నాయ‌కుడిగా ఉన్న మీరు ఇలాంటి నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డం, కామెంట్స్ చేయ‌డం త‌గ‌దంటూ స్ప‌ష్టం చేసింది ధ‌ర్మాస‌నం. ఇలాంటి అనాలోచిత వ్యాఖ్య‌ల వ‌ల్ల గంద‌ర‌గోళానికి గుర‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని పేర్కొంది.

దేశ ప్ర‌జ‌లు మీరు ఏం మాట్లాడుతున్నార‌నేది నిశితంగా గ‌మ‌నిస్తుంటార‌ని, వారిని గ‌మ‌నించి ముందు వెనుకా ఆలోచించి మ‌ట్లాడాల‌ని హిత‌వు ప‌లికింది. ఇప్ప‌టికైనా దీనిని గ‌మనించాల‌ని హిత‌వు ప‌లికింది స‌ర్వోన్న‌త న్యాయ స్థానం.  ఇదిలా ఉండ‌గా సుప్రీంకోర్టు చేసిన తాజా వ్యాఖ్య‌లు తీవ్ర క‌ల‌క‌లం రేపాయి. తాజా తీర్పుపై రాహుల్ గాంధీ ఇంకా స్పందించ‌లేదు. అయితే ప్ర‌తి సంద‌ర్బంలోనూ మోదీ స‌ర్కార్ వైఫ్యాల‌ను నిరంత‌రం ఎండ‌గుడుతూ వ‌స్తున్నారు.

Also Read : Chinta Mohan Sensational Comments : రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ కోసం న‌డుం బిగించాలి

Exit mobile version