Chinta Mohan Sensational Comments : రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ కోసం న‌డుం బిగించాలి

పిలుపునిచ్చిన మాజీ కేంద్ర మంత్రి చింతా మోహ‌న్

Hello Telugu - Chinta Mohan Sensational Comments

Hello Telugu - Chinta Mohan Sensational Comments

Chinta Mohan : చిత్తూరు జిల్లా – భార‌త రాజ్యాంగ ప‌రిరక్ష‌ణ కోసం న‌డుం బిగించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని అన్నారు మాజీ కేంద్ర మంత్రి చింతా మోహ‌న్ (Chinta Mohan). ఆదివారం కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు రాజ్యాంగ పరిరక్షణ మహా పాదయాత్రను ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలల నుంచి కుప్పంకు భారీగా తరలి వచ్చారు ఎస్సీ ఉద్యోగులు, దళిత సంఘాల నాయకులు. రాజ్యాంగ పరిరక్షణ కోసం , మానవ హక్కుల పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు కొనసాగుతుంద‌న్నారు.

Chinta Mohan Key Comments on Constitution

చింతా మోహన్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. పాదయాత్ర విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా, త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. దళితుల ఐక్యత వర్ధిల్లాలి.. రాజ్యాంగాన్ని కాపాడాలి… జై భీమ్ నినాదాలతో కుప్పం దద్ధరిల్లింది. అనంత‌రం చింతా మోహ‌న్ మీడియాతో మాట్లాడారు. దళితులందరూ కన్నీటితో ఉన్నారని, కష్టాల్లో ఉన్నారని అన్నారు. ఎప్పుడూ కనపడని ఆందోళన నేడు ఎస్సీల్లో కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా టీటీడీలో అంటరానితనం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అన్యమతం పేరుతో ఒక నిరుపేద ఎస్సీ మహిళను ఉద్యోగం నుంచి తీసి వేయడం దారుణం. చాలా బాధాకరమ‌న్నారు.

వర్గీకరణను అందరూ వ్యతిరేకిస్తున్నారని, బిజెపి పాలనలో అరాచకం స్పష్టంగా ఉందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే, నేడు భారతదేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని భాషల ప్రజలు కలిసి జీవిస్తున్నార‌ని అన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉందన్నారు. ఎస్సీ మాల ఉద్యోగులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమలా సుదర్శన్, చెన్నకేశవులు మాట్లాడుతూ, బిజెపి పాలనలో భారత రాజ్యాంగానికి పెను ముప్పు ఏర్పడిందన్నారు.

Also Read : Minister Parthasarathy Fired on YS Jagan : సంక్షేమ ప‌థ‌కాలు సెన్సేష‌న్ జ‌గ‌న్ ఫ్ర‌స్ట్రేష‌న్

Exit mobile version