Supreme Court Sensational Oreder : వీధి కుక్క‌ల‌కు రోడ్ల‌పై కాదు ఇళ్ల‌ల్లో ఆహారం పెట్టాలి

సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించిన న్యాయ‌మూర్తి

Hello Telugu - Supreme Court Sensational Oreder

Hello Telugu - Supreme Court Sensational Oreder

Supreme Court : ఢిల్లీ – భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వీధి కుక్క‌ల అంశానికి సంబంధించి దాఖ‌లైన పిటిష‌న్ పై బుధ‌వారం విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్బంగా న్యాయ‌మూర్తి ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు. వీధి కుక్కలకు ఆహారం పెట్టాలని అనుకునేవారు ఇంట్లోకే తీసుకెళ్లి పెట్టొచ్చుగా అని ప్ర‌శ్నించింది. వీధి కుక్కలకు ఆహారం పెట్టాలనుకునేవారు వీధుల్లో కాకుండా, వారి ఇంట్లోనే ఆహారం ఎందుకు పెట్టకూడదని మండిప‌డింది సుప్రీంకోర్టు.

Supreme Court of India Orders

కాలనీలలోని వీధి కుక్కలకు ఆహారం పెడుతున్నందుకు స్థానికులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సంద‌ర్బంగా ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు న్యాయ‌మూర్తి. వీధి శునకాలకు ఆహారం పెట్టాలని అనుకునేవారు ప్రతి రోడ్డును ఉపయోగించుకుంటే మనుషులకు స్థలం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించింది ధ‌ర్మాస‌నం.

శునకాలపై ప్రేమ ఉన్న వారు వాటిని తమ ఇంటికే తీసుకెళ్లి ఆహారం పెడితే ఎవరు ఆపుతారని అడిగారు న్యాయమూర్తి. సంక్షేమ సంఘాలు, అపార్ట్‌మెంట్‌ ఓనర్ అసోసియేషన్లు తమ ప్రాంతంలోని శునకాలకు ఆహారం ఇవ్వడానికి అవసరమైన ఏర్పాట్లు చేసే బాధ్యత ఉంటుందని నోయిడాకు చెందిన ఓ వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖ‌లు చేశారు. ఇందుకోసం ప్రజలు ఎక్కువగా రాకపోకలు సాగించని ప్రదేశాలలో కుక్కలకు ఫీడింగ్ పాయింట్లు ఏర్పాట్లు చేయాలని కోరారు పిటిష‌న‌ర్.

Also Read : Prabhakar Rao Case – Shocking Update : మ‌రోసారి సిట్ ముందుకు ప్ర‌భాక‌ర్ రావు

Exit mobile version