మంత్రి అనిత‌పై అనుచిత వ్యాఖ్య‌లు త‌గ‌దు

టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ

hellotelugu-BandaruSravaniSree

పుట్ట‌ప‌ర్తి శ్రీ స‌త్య‌సాయి జిల్లా : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌లపూడి అనిత‌పై వైసీపీ నాయ‌కులు అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. ఆమె ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరగడం అనేది అక్షర సత్యం అన్నారు. షెడ్యూల్డ్ కులాల (SC) వర్గానికి చెందిన ఒక మహిళ తన సొంత శక్తి సామర్థ్యాలతో పైకి ఎదిగారని ఏ ఒక్క‌రిపై ఆధార‌ప‌డ‌కుండా త‌నంత‌కు తానుగా ఈ స్థాయికి వ‌చ్చార‌ని పేర్కొన్నారు.. గొప్ప విదుషీమణిగా గుర్తింపు పొందారు. అవిశ్రాంత కృషి ద్వారా రాష్ట్ర హోం మంత్రి స్థాయికి చేరుకున్నార‌ని ప్ర‌శంసించారు బండారు శ్రావ‌ణి శ్రీ‌. హోం మంత్రి ధైర్యం మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుందోంద‌న్నారు.

పిరికివారు మీ సంకల్పాన్ని దెబ్బ తీయడానికి ఎంత ప్రయత్నించినా, మీ ధైర్యసాహసాలతో వారికి తగిన గుణపాఠం చెబుతారని మాకు తెలుసు .ఎవ‌రు ఎన్ని ర‌కాలుగా కామెంట్స్ చేసినా మీరు అంత‌కు మించి ఎదుర్కొనే ద‌మ్ము, ధైర్యం ఉంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు బండారు శ్రీ‌వాణి శ్రీ‌. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసేవారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్ప‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. రోజు రోజుకు వైసీపీ నాయ‌కులు ప‌దే ప‌దే కావాల‌ని వ్య‌క్తిగ‌త దూష‌ణ‌కు దిగుతున్నార‌ని, ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు టీడీపీ ఎమ్మెల్యే. దీనిని స‌హించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. త‌న ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేసిన స‌ద‌రు నేత‌లు బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

Exit mobile version