Prabhakar Rao Case – Shocking Update : మ‌రోసారి సిట్ ముందుకు ప్ర‌భాక‌ర్ రావు

సుదీర్ఘంగా విచారించిన సిట్ అధికారులు

Hello Telugu - Prabhakar Rao Case - Shocking Update

Hello Telugu - Prabhakar Rao Case - Shocking Update

Prabhakar Rao : హైద‌రాబాద్ – ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మ‌రోసారి సిట్ ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు సీఐబీ మాజీ చీఫ్ ప్ర‌భాక‌ర్ రావు (Prabhakar Rao). త‌న‌ను సుదీర్ఘంగా విచారించారు. ప్ర‌భాక‌ర్ రావు సెల్ ఫోన్ సీజ్ చేశారు. త‌న ఫోన్ లో ఉన్న డేటాను డిలీట్ చేసిన‌ట్లు గుర్తించారు. తొల‌గించిన డేటాను తిరిగి ప‌రిశీలించేందుకు గాను ఎఫ్ ఎస్ ఎల్ కు పంపించింది సిట్. ఇదిలా ఉండ‌గా విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌లేద‌ని సిట్ తేల్చింది. దీంతో మ‌రోసారి విచార‌ణ‌కు రావాలంటూ ఆదేశించింది ప్ర‌భాక‌ర్ రావును.

Prabhakar Rao Phone Tapping Case Updates

గ‌త కేసీఆర్ బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో త‌ను కీల‌క‌మైన ప‌ద‌వి నిర్వ‌హించారు. ఫోన్ ట్యాపింగ్ పెద్ద ఎత్తున త‌న హ‌యాంలోనే జ‌రిగిన‌ట్లు సిట్ తేల్చింది. 10 ఏళ్లుగా రాష్ట్రంలో ప్ర‌జా ప్ర‌తినిధులు, సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు, న‌టీ న‌టులు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, క్రీడాకారులు, వ్యాపార‌, వాణిజ్య రంగాల‌కు చెందిన వారి ఫోన్ల‌ను ట్యాప్ చేసిన‌ట్లు గుర్తించారు. అంతే కాకుండా ప్ర‌ముఖుల భార్య‌ల‌కు సంబంధించిన ఫోన్ల‌ను సైతం ట్యాప్ చేసి వారు ఏమేం మాట్లాడుతున్నార‌నేది కూడా విన్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఈ మొత్తం వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ఇదే స‌మ‌యంలో ప‌దేళ్ల దొర పాల‌న‌కు చ‌ర‌మ గీతం పాడింది కాంగ్రెస్ పార్టీ. సీఎం రేవంత్ రెడ్డి సార‌థ్యంలో తెలంగాణ‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ వెంట‌నే ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంపై విచార‌ణ కోసం ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ త‌ర్వాత సిట్ ప‌లువురిని విచారించింది కేసులో భాగంగా. విస్తు పోయే వాస్త‌వాలు వెలుగులోకి వ‌చ్చాయి. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రెవ‌రి ఫోన్లు ట్యాపింగ్ కు గుర‌య్యాయ‌నేది ఇంకా వెల్ల‌డించ‌లేదు.

Also Read : Singapore Growth : ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన న‌గ‌రంగా సింగ‌పూర్

Exit mobile version