Supreme Court : ఢిల్లీ : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. 2001లో హోటలియర్ జయ శెట్టి హత్య కేసులో మాఫియా డాన్ చోటా రాజన్ బెయిల్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) రద్దు చేసింది. గ్యాంగ్‌స్టర్ జీవిత ఖైదును నిలిపి వేసిన బాంబే హైకోర్టు ఉత్తర్వును సుప్రీంకోర్టు రద్దు చేసింది. చోటా రాజన్ 27 సంవత్సరాలు పరారీలో ఉన్నాడని చెప్పారు. చోటా రాజన్‌కు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. రాజన్ (Chota Rajan) జీవిత ఖైదును నిలిపి వేసింది. ఈ కేసులో అతనికి బెయిల్ మంజూరు చేసింది బాంబే హైకోర్టు . గత సంవత్సరం అక్టోబర్ 23న ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేసింది కోర్టులో సీబీఐ. ఈ అప్పీల్‌పై జస్టిస్‌లు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం అనుమతించింది.
Supreme Court Shocking Verdict
రాజన్ 27 సంవత్సరాలుగా పరారీలో ఉండి నాలుగు కేసుల్లో దోషిగా నిర్ధారించ బడ్డాడని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాంటి వ్యక్తికి శిక్షను ఎందుకు నిలిపి వేయాలని అని బెంచ్ ప్రశ్నించింది. రాజన్ తరపు న్యాయవాది ఇది ఎటువంటి ఆధారాలు లేని కేసు అని వాదించారు. 71 కేసుల్లో 47 కేసుల్లో రాజన్‌పై సిబిఐ ఎటువంటి ఆధారాలు కనుగొనలేదని. దర్యాప్తు సంస్థ వాటిని మూసి వేసిందని న్యాయవాది వెల్లడించారు. రాజన్ ప్రత్యేక హత్య కేసులో దోషిగా నిర్ధారించబడి జీవిత ఖైదు విధించ బడిందని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. సిబిఐ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్ వి రాజు, ఈ కేసులో రాజన్‌కు విధించిన జీవిత ఖైదును హైకోర్టు నిలిపి వేసిందని అన్నారు. రాజన్ తరపు న్యాయవాది ఇది సాక్ష్యం లేని కేసు అని వాదించినప్పుడు, మీ పేరు కూడా తగినంత పెద్దది అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
రాజన్ ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడని, మరొక కేసులో శిక్ష అనుభవిస్తున్నాడని పేర్కొంది. మే 2024లో హోటల్ యజమాని హత్య కేసులో ప్రత్యేక కోర్టు రాజన్‌ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది.
Also Read : MLA Raj Gopal Reddy Shocking Comments : నిరుద్యోగులతో పెట్టుకుంటే ప్రమాదం
