Vallabhaneni Vamsi : ఢిల్లీ – అక్రమ మైనింగ్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి (Vallabhaneni Vamsi) సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు పక్కన పెట్టింది. ఏపీ సర్కార్ దాఖలు చేసిన దావాను అనుమతించింది. రాష్ట్ర సర్కార్ వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. ఈ పిటిషన్ పై తాజాగా విచారణ చేపట్టాలని ఆదేశించింది ధర్మాసనం. కేసు మెరిట్స్ లోకి, పీటీ వారెంట్స్ లోకి వెళ్లట్లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.
Supreme Court Shocking Vallabhaneni Vamsi
ఇరువురి వాదనలు విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది . వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన 4 వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా వల్లభనేని వంశీ ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. పలు కేసులలో ఇరుక్కున్నారు. ఆయనపై సర్కార్ కేసులు నమోదు చేసింది.
మాజీ ఎమ్మెల్యే 5 నెలల పాటు జైలులో ఉన్నారు. చివరకు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గురువారం వల్లభనేని కేసుకు సంబంధించి విచారణ చేపట్టింది ధర్మాసనం. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కాగా వల్లభనేని వంశీ గత జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారంటూ ప్రస్తుత టీడీపీ సర్కార్ ఆరోపించింది. ఈ మేరకు కేసులు నమోదు చేసింది.
Also Read : CM Revanth Reddy Strong Focus : యుద్ద ప్రాతిపదికన టెలిమెట్రీ విధానం – సీఎం
