Seediri Appalaraju : శ్రీకాకుళం జిల్లా – ఏపీ కూటమి సర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు.రూ.కోట్ల విలువైన భూమిని లులూకు అడ్డగోలుగా ఇచ్చారని ఆరోపించారు. విశాఖలో సత్వ అనే కంపెనీకి కూడా ఇలానే కట్టబెట్టారని అన్నారు. లులూ మాల్స్‌లో కేవలం షాపులే ఉంటాయని, . లక్షల్లో జీతాలు వచ్చే ఉద్యోగులు ఉండరన్నారు. లులూ ఏదో పెద్ద ప్రాజెక్టులా హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడైనా ఎవరైనా ఎకరా 99 పైసలకే ఇస్తారా అని ప్రశ్నించారు.
Ex Minister Seediri Appalaraju Slams AP Govt
మంగళవారం సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారెంటీల పేరుతో ఇప్పటికే ప్రజల నెత్తిన శఠగోపం పెట్టిన సర్కార్ ఇప్పుడు ప్రజలకు సంబంధించిన ఆస్తులను గంపగుత్తగా తక్కువ ధరకే కంపెనీలకు కట్టబెట్టడం పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు మాజీ మంత్రి. ఇది మంచి పద్దతి కాదన్నారు. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాల్సిన సర్కార్ ఇలా పెట్టుబడిదారులకు, కంపెనీలకు అడ్డగోలుగా భూములను అప్పగించడం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఇప్పటికే అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వ్యక్తిగత ప్రచారంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారని ఆరోపించారు. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని ఏనాడో మరిచి పోయాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కొలువు తీరాక చంద్రబాబు నాయుడు కేవలం పర్యటనల పైనే ఫోకస్ పెట్టాడని, రాష్ట్రంలో పాలనను గాలికి వదిలి వేశాడని ఫైర్ అయ్యారు. దీంతో పాలన గాడి తప్పిందని, జనం అనేక అవస్థలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Rave Party Sensational : రేవ్ పార్టీ కలకం భారీగా డ్రగ్స్ స్వాధీనం
