Sunil Gavaskar : ముంబై – భారత క్రికెట్ జట్టు మాజీ స్కిప్పర్, ప్రముఖ కామెంటేటర్ సునీల్ మనోహర్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా చిట్ చాట్ సందర్బంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కేరళ సూపర్ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ గురించి ప్రస్తావించాడు. తను అద్భుతమైన ఆటగాడని కొనియాడారు. ఇదే సమయంలో టి20 ఫార్మాట్ లో ఆడించడం కాకుండా వన్డే (ఓడీఐ) ఫార్మాట్ లో తనను ఎంపిక చేయాలని సూచించాడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలెక్షన్ కమిటీ (బీసీసీఐ) చైర్మన్ అజిత్ అగార్కర్ కు.
Sunil Gavaskar Refer
అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడని, తను వన్డే ఫార్మాట్ కు సరిగా సరిపోతాడని స్పష్టం చేశాడు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar). ప్రస్తుతం భారత జట్టు శుభ్ మన్ గిల్ సారథ్యంలో టెస్టు సీరీస్ ఆడుతోంది ఇంగ్లండ్ తో. ఇప్పటికే 5 టెస్టు మ్యాచ్ ల సీరీస్ లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలుచుకున్నాయి. ప్రస్తుతం మూడో టెస్టు కొనసాగుతోంది. యంగ్ క్రికెటర్లు సంచలనం సృష్టిస్తున్నారు. ఇక సంజూ శాంసన్ విషయానికి వస్తే తను ఏ ఫార్మాట్ లో నైనా అద్బుతంగా ఆడగలడు. తను ప్రస్తుతం ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఈసారి జరిగిన మెగా టోర్నీలో తను గాయం కారణంగా ఆశించిన మేర ఆడలేక పోయాడు. తన స్థానంలో రియాన్ పరాగ్ ను స్కిప్పర్ గా కొనసాగించారు. ఇదే సమయంలో రాహుల్ ద్రవిడ్ ఆ జట్టుకు మెంటార్ గా రావడంతో తనకు మేనేజ్ మెంట్ కు పొసగడం లేదంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో తను వస్తానంటే భారీ ధరకు కొనుగోలు చేస్తామంటూ ఇప్పటికే ప్రకటించింది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం. దీంతో తను వచ్చే ఐపీఎల్ లో సీఎస్కే తరపున ఆడడం దాదాపు ఖాయమై పోయందని టాక్. ఇదిలా ఉండగా శాంసన్ గురించి గవాస్కర్ చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read : HCA President Jagan Mohan Shocking : హెచ్ సీ ఏ ప్రెసిడెంటా మజాకా
