Sundar Pichai Growth : బిలియనీర్ లిస్ట్ చేరనున్న గూగుల్ మాతృ సంస్థ అల్బెర్ట్ సీఈఓ

ఆల్‌ఫబెట్ షేర్ల ధరల పెరుగుదలతో పిచాయ్ సంపద కూడా భారీగా పెరిగింది...

Hello Telugu - Sundar Pichai Growth

Hello Telugu - Sundar Pichai Growth

Sundar Pichai : గూగుల్ మాతృసంస్థ ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ మరో విజయాన్ని సాధించారు. ఆయన సంపద విలువ 1.1 బిలియన్ల డాలర్లను దాటి, టెక్ ప్రపంచంలో ప్రముఖ CEOs జాబితాలో నిలిచారు. ఈ విషయం బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ద్వారా వెలుగుచూడగా, ఆల్‌ఫబెట్ షేర్ల ధరల పెరుగుదలతో పిచాయ్ సంపద (Sundar Pichai) కూడా భారీగా పెరిగింది.

Sundar Pichai Added on Billioner List

2023 సంవత్సరం ప్రారంభం నుండి, ఆల్ఫబెట్ షేర్లు లాభాల బాట పట్టి, సంస్థ యొక్క మార్కెట్ విలువ 1 ట్రిలియన్ డాలర్లను దాటింది. దీనితో ఇన్వెస్టర్లకు 120% లాభాలు వచ్చాయి. ప్రస్తుతం, ఆల్ఫబెట్ షేర్లు తమ జీవితకాల గరిష్ఠం వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో, కంపెనీ ఉన్నతాధికారుల ఆస్తులు కూడా పెరిగిపోయాయి. ఈ క్రమంలో, సుందర్ పిచాయ్ (Sundar Pichai) వంటి నాన్ ఫౌండర్ CEOsలో, బిలియన్ డాలర్ల సంపద కలిగిన వ్యక్తులలో ఒకరిగా నిలిచారు.

గత గురువారం, ఆల్ఫబెట్ త్రైమాసిక ఫలితాలు విడుదలైన తరువాత, కంపెనీ షేర్లు 4.1% మేర పెరిగాయి. ఈ అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా షేరు ధర పెరిగింది. ప్రస్తుతం, పిచాయ్‌కు ఆల్ఫబెట్ సంస్థలో 0.02% వాటా ఉంది, దీని విలువ సుమారు 440 మిలియన్ డాలర్లు.

అంతేకాక, పిచాయ్ గత 10 సంవత్సరాలలో 650 మిలియన్ డాలర్ల విలువైన ఆల్ఫబెట్ షేర్లను విక్రయించారని తెలుస్తోంది. ఈ షేర్లను ఆయన ఇంకా తన వద్ద ఉంచి ఉంటే, ఆయన సంపద విలువ 2.5 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చునని బ్లూమ్‌బర్గ్ అంచనా వేసింది.

సుందర్ పిచాయ్ తమిళనాడులో జన్మించిన విషయం తెలిసిందే. 1993లో ఆయన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ స్కాలర్‌షిప్‌తో అమెరికాకు వెళ్లారు. 2004లో గూగుల్‌లో చేరిన పిచాయ్, ఆ తరువాత సంస్థలో వివిధ కీలక విభాగాలకు నేతృత్వం వహిస్తూ, అంచలంచెలుగా ఎదుగుతూ 2015లో గూగుల్ సీఈఓగా ఎంపికయ్యారు. 2015 తర్వాత, ఆయన ఆల్ఫబెట్ సంస్థకు సీఈఓగా నియమించబడ్డారు.

ప్రస్తుతం, పిచాయ్ సారథ్యంలో ఆల్‌ఫబెట్ సంస్థ ఏఐ (కృత్రిమ మేధ) విభాగంపై దృష్టి పెట్టింది. గత ఏడాది గూగుల్ ఏఐపై 50 బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో, పిచాయ్ దారితీసిన సాంకేతిక అభివృద్ధి, ఆయన ప్రాబల్యం మరియు సంస్థ ఎదుగుదల శక్తిని మరింత పెంచాయి.

Also Read : Today Gold Price : పసిడి ప్రియులకు శుభవార్త…తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు

Exit mobile version