వాషింగ్టన్ : స్టార్ లింక్ చైర్మన్, టెస్లా , ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ బాంబు పేల్చాడు. ఏకంగా తాను అమెజాన్ పై గురి పెట్టాడు. తాజాగా ఓ సంచలన ప్రకటన చేశాడు. అమెజాన్ కు పోటీగా తాను ఓ ఆన్ లైన్ షాపింగ్ ప్లాట్ ఫామ్ తీసుకు రానున్నట్లు వెల్లడించాడు. త్వరలోనే పేరు కూడా ప్రకటిస్తానని తెలిపాడు తన ఎక్స్ వేదికగా. ఇప్పుడు లాజిస్టిక్ రంగంలో పెను సంచలం సృష్టిస్తోంది. అమెజాన్ తన వెబ్సైట్లో కొనుగోళ్లు చేయకుండా ఏఐ బాట్లను పరిమితం చేసిందన్న నివేదికల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.తమ గ్రాక్-ఆధారిత బాట్‌ను ఆర్డర్లు పెట్టకుండా అమెజాన్ అడ్డుకుంటోందని ఒక ఎక్స్ యూజర్ ఆరోపించడంతో ఈ చర్చ మొదలైంది. ప్రజలు ఏఐ అసిస్టెంట్లను ఉపయోగించి ఉత్పత్తులను కొనుగోలు చేయగల ఎక్స్ షాప్ అనే కొత్త షాపింగ్ ప్లాట్‌ఫామ్‌ను మస్క్ ప్రారంభించాలని ఆ యూజర్ సూచించారు.
ఈ సూచనకు స్పందిస్తూ అమెజాన్‌కు పోటీగా తమ కంపెనీలు ఒక ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించడాన్ని పరిశీలించవచ్చని మస్క్ రాశారు. అయితే, ఆయన ఎక్స్ షాప్ ను ప్రారంభించే ప్రణాళికలను అధికారికంగా ప్రకటించలేదు లేదా అటువంటి ప్లాట్‌ఫామ్ ఎలా పని చేస్తుందనే దాని గురించి వివరాలు అందించలేదు. ఇక అమెజాన్ తన వెబ్సైట్లో షాపింగ్ చేయడానికి ప్రయత్నించే థర్డ్-పార్టీ ఏఐ అసిస్టెంట్లపై ఆంక్షలను కఠినతరం చేస్తోంది. వినియోగదారుల తరపున కొనుగోళ్లు చేయకుండా మెటా మ్యూస్ ఏఐ అసిస్టెంట్‌ను కూడా ఆ కంపెనీ నిరోధించింది. తమ ఏఐ అసిస్టెంట్ ఆన్లైన్ స్టోర్‌ను యాక్సెస్ చేస్తుందనే విషయాన్ని మెటా తమకు తెలియ జేయలేదని అమెజాన్ పేర్కొంది. బాట్ గుర్తింపు ,కస్టమర్ క్రెడెన్షియల్స్ నిర్వహణపై కూడా ఇది ఆందోళన వ్యక్తం చేసింది. థర్డ్-పార్టీ సేవలు తమ వెబ్సైట్ నియమాలను , భద్రతా అవసరాలను తప్పనిసరిగా గౌరవించాలని ఆ కంపెనీ స్పష్టం చేసింది.
