స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పై సైబర్ దాడి

డార్క్ వెబ్‌లో 3,897 మంది కస్టమర్ల వివరాలు

hellotelugu-SBI

ముంబై : భార‌త దేశంలో అత్యున్న‌త బ్యాంకింగ్ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కి కోలుకోలేని షాక్ త‌గిలింది. సైబ‌ర్ అటాక్ జ‌రిగింది బ్యాంక్ పై. ప్రాథమిక విశ్లేషణ ప్రకారం బహిర్గతమైన సమాచారంలో కస్టమర్ల పేర్లు, మొబైల్ నంబర్లు, పుట్టిన తేదీలు, ఈమెయిల్ చిరునామాలు, నివాస చిరునామాలు, కస్టమర్ గుర్తింపు వివరాలు, రుణాలకు సంబంధించిన రికార్డులు ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం నాడు ఇందుకు సంబ‌ధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ఒక సైబర్ దాడి జరిగినట్లు వెల్లడించింది. దీనిని ధ్రువీక‌రించింది కూడా. దీంతో ఎస్బీఐ బ్యాంకు ఖాతాదారులు తీవ్ర ఆందోళ‌నలో ఉన్నారు. కోట్లాది మంది ఈ బ్యాంకులో ఖాతాదారులు ఉన్నారు.

దీనివల్ల 3,897 మంది కస్టమర్లకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్‌లో బయట పడింది. ఈ డేటా లీక్‌పై సమగ్ర విచారణ జరిపేందుకు, పరిస్థితి తీవ్రతను అంచనా వేసేందుకు ఒక స్వతంత్ర సైబర్ భద్రతా సంస్థను నియమించినట్లు బ్యాంక్ ప్ర‌క‌టించింది. ఈ ఘటన వల్ల బ్యాంక్ ప్రధాన వ్యాపార కార్యకలాపాలపై, ఆర్థిక పనితీరుపై లేదా వ్యాపార కొనసాగింపుపై ఎటువంటి గణనీయమైన ప్రభావం ఉండదని బ్యాంక్ పేర్కొంది. కాగా ఆర్థిక సంస్థలను లక్ష్యంగా చేసుకునే ముప్పులు పెరుగుతున్న నేపథ్యంలో, భారతీయ బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ (ఆర్బీఐ) గత కొన్నేళ్లుగా బ్యాంకులు తమ సైబర్ భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవాలని సూచిస్తూ వస్తోంది. ఈ తరుణంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

Exit mobile version