Popular Director Sukumar Comments : 2027లో పుష్ప -3పై సుకుమార్ ఫోక‌స్

మ‌రోసారి కీల‌క పోషిస్తున్న బ‌న్నీ, ర‌ష్మిక

Hello Telugu - Popular Director Sukumar Comments

Hello Telugu - Popular Director Sukumar Comments

Sukumar : హైద‌రాబాద్ : ద‌మ్మున్న ద‌ర్శ‌కుడు సుకుమార్ (Sukumar) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పుష్ప మూవీ సంచ‌లనం సృష్టించింది. పుష్ప‌, పుష్ప 2 దుమ్ము రేపింది క‌లెక్ష‌న్ల ప‌రంగా. ఆర్య నుంచి అల్లు అర్జున్, సుకుమార్ ల కాంబినేష‌న్ స‌క్సెస్ అవుతూ వ‌చ్చింది. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లోనే పుష్ప -2 చ‌రిత్ర సృష్టించింది. ఏకంగా రూ. 1867 కోట్లు వ‌సూలు చేసి విస్తు పోయేలా చేసింది. తాజాగా ఈ ఇద్ద‌రి నుంచి పుష్ప మూవీ సీక్వెల్ వ‌స్తుందా అన్న ఉత్కంఠ‌కు తెర దించే ప్ర‌య‌త్నం చేశాడు . సుకుమార్, బ‌న్నీ నుంచి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. పుష్ప సీక్వెల్ మూడో పార్టు రాబోతోంది. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ ముఖ్య‌మైన పాత్ర పోషిస్తున్నాడు స‌న్ మూవీ పిక్చ‌ర్స్ నిర్మాణ సార‌థ్యంలో అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో న్యూ మూవీలో. ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలోనే అత్య‌ధిక రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

Director Sukumar Gives Update on Pushpa-3

ఇప్ప‌టి వ‌ర‌కు ఇల‌య నాయ‌గ‌న్ క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన ఇండియ‌న్ మూవీ ఒక్క‌టే మూడు పార్టులుగా వ‌చ్చింది ప్రేక్ష‌కుల ముందుకు. అట్లీ మూవీ షూటింగ్ పూర్త‌య్యాక 2027లో సుకుమార్, బ‌న్నీ క‌లిసి పుష్ప -3 కోసం రానున్నారు. పుష్ప ది రైజ్ , పుష్ప ది రూల్ పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చాడు. రెండు పార్ట్ ల‌లో హీరోయిన్ పాత్ర పోషించింది నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా. తొలి పార్ట్ లో ఊ అంటావా స్పెష‌ల్ సాంగ్ లో త‌ళుక్కున మెరిసింది స‌మంత రుత్ ప్ర‌భు. పుష్ప పార్ట్ 2 మూవీలో స్పెష‌ల్ సాంగ్ లో శ్రీ‌లీల కిస్స‌క్ అంటూ కైపెక్కించేలా చేసింది. ఇక రాబోయే మూడో పార్టు మూవీలో ప్ర‌త్యేక పాట‌లో ఎవ‌రిని ఎంపిక చేస్తాడో ద‌ర్శ‌కుడు చూడాలి.

Also Read : IT Minister Nara Lokesh Clear Update : ఏపీలో ట్రిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డులే ల‌క్ష్యం

Exit mobile version