ముంబై : ఎల్ఐసీ రెండవ త్రైమాసికంలో బలమైన పనితీరును కనబరిచింది. ఐడీబీఐ బ్యాంక్ పెట్టుబడుల ఉపసంహరణ బ్యాంకాస్యూరెన్స్పై ప్రభావం చూపకపోవచ్చు. మొదటి అర్ధభాగంలో కొత్త వ్యాపార ప్రీమియం, మొత్తం ప్రీమియం ఆదాయం , ఇతర కీలక ఆర్థిక పారామితులలో ఆరోగ్యకరమైన వృద్ధితో బలమైన పనితీరును కనబరిచిందని మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఆర్ దొరైస్వామి తెలిపారు. ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారీ లాభాలను కనబర్చడం పట్ల ఆనందంగా ఉందన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే కంపెనీ యొక్క వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ మార్జిన్ కూడా మెరుగు ఇపడిందని చెప్పారు. ఇవాళ ఎల్ఐసీ ఎండీ, సీఈఓ దొరైస్వామి మీడియాతో మాట్లాడారు.
ఈక్విటీ మార్కెట్లలో ఇటీవలి అస్థిరత ,ఈక్విటీ-లింక్డ్ పెట్టుబడి సాధనాల విలువలపై ఒత్తిడి, మార్కెట్-లింక్డ్ బీమా ఉత్పత్తుల అమ్మకాలను, ముఖ్యంగా యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ల అమ్మకాలను ప్రభావితం చేశాయని ఆయన అన్నారు. రెగ్యులర్-ప్రీమియం మార్కెట్-లింక్డ్ ఉత్పత్తులపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గడం, రెండవ త్రైమాసికంలో యులిప్ అమ్మకాల క్షీణతకు దారితీసిందని ఆయన తెలిపారు. అయితే ఈ క్షీణత పూర్తిగా మార్కెట్ ప్రేరేపితం కాదని, ఎందుకంటే అధిక-విలువ గల యులిప్ లు , రక్షణ వ్యాపారంపై మరింత దృష్టి పెట్టడానికి ఎల్ఐసీ యాజమాన్య స్థాయిలో వ్యూహాత్మక మార్పులు కూడా చేసిందని ఆయన జోడించారు. మార్కెట్ సెంటిమెంట్ మెరుగు పడుతుందని అంచనా వేస్తున్నందున ప్రస్తుత , రాబోయే త్రైమాసికాల్లో మెరుగైన పనితీరును కనబరుస్తున్నామని వెల్లడించారు సీఈఓ.


















