Stock Market : ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా మూడో రోజూ పెరుగుదలతో ముగిశాయి. బ్యాంకింగ్ దిగ్గజాలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో కొనుగోళ్లు, దేశీయ మరియు విదేశీ పెట్టుబడుల దన్నుతో మార్కెట్ ఉత్సాహంగా ఉంది.
శుక్రవారం సెన్సెక్స్ ఒక దశలో 704.58 పాయింట్లు ఎగబాకి 84,172.24 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 484.53 పాయింట్ల లాభంతో 83,952.19 వద్ద స్థిరపడింది — ఇది జూన్ 27 తర్వాతి అత్యధిక ముగింపు స్థాయి.
నిఫ్టీ 124.55 పాయింట్ల వృద్ధితో సరికొత్త ఏడాది గరిష్ఠ స్థాయి 25,709.85 వద్ద ముగిసింది.
బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ₹466.92 లక్షల కోట్లకు (దాదాపు $5.31 ట్రిలియన్) చేరింది.
Stock Market – మిడ్‌వెస్ట్ ఐపీఓ బంపర్ హిట్!
తెలంగాణా ఆధారిత గ్రానైట్ కంపెనీ మిడ్‌వెస్ట్ లిమిటెడ్ రూ.451 కోట్ల ఐపీఓకు అపారమైన స్పందన లభించింది. NSE డేటా ప్రకారం, పబ్లిక్ ఇష్యూ 87.89 రెట్ల సబ్‌స్క్రిప్షన్ పొందింది. కంపెనీ 31.17 లక్షల షేర్లను విక్రయానికి పెట్టగా, ఇన్వెస్టర్ల నుండి 27.40 కోట్ల షేర్ల బిడ్లు వచ్చాయి.
సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగం 168.07 రెట్లు, అర్హులైన సంస్థాగత కొనుగోలుదారులు (QIB) 139.87 రెట్లు, రిటైల్ పెట్టుబడిదారులు 24.26 రెట్లు సబ్‌స్క్రిప్షన్ చేశారు.
Also Read : Gold Price Growth : తాజాగా మరోసారి భారీగా పెరిగిన పసిడి ధరలు
